Begin typing your search above and press return to search.

శ‌త్రు గుండెల్లో దురంధ‌ర్.. ఇజ్రాయెల్ నుంచి భార‌త్ కు క్షిప‌ణి

ఖండాంత‌ర క్షిప‌ణులు.. ఒక ఖండం నుంచి వేరే ఖండానికి ప్ర‌యోగించ గ‌ల రేడియ‌స్. అంటే, వేలాది కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల సామ‌ర్థ్యం

By:  Tupaki Political Desk   |   24 Feb 2026 1:53 PM IST
శ‌త్రు గుండెల్లో దురంధ‌ర్.. ఇజ్రాయెల్ నుంచి భార‌త్ కు క్షిప‌ణి
X

2 వేల కిలోమీట‌ర్ల ప‌రిధి... భార‌త అత్యాధునిక క్షిప‌ణి బ్ర‌హ్మోస్ ను త‌ల‌ద‌న్నేలా వేగం.. పైగా డెవ‌ల‌ప్ చేసింది ఇజ్రాయెల్..! బంక‌ర్ల‌యినా బ‌ద్ధ‌లు కావాల్సిందే.., అత్యంత ప‌క‌డ్బందీ సైనిక స్థావ‌రాలైన తునాతున‌క‌లు కావాల్సిందే.. అణు స్థావ‌రాలు ధ్వంసం కావాల్సిందే..! అలాంటి క్షిప‌ణిని కొనుగోలు చేస్తోంది భార‌త్. శ‌త్రువుల గుండెల్లో మిస్సైళ్లు ప‌రిగెత్తించే ఈ క్షిప‌ణి మ‌న దేశం సొంతం కానుంది. ఆధునిక కాలంలో ఎంతటి విధ్వంస‌క ఆయుధాలు ఉంటే అంత ప్ర‌యోజ‌నం అనే సంగ‌తి తెలిసిందే. వినియోగించ‌డం, వినియోగించ‌క‌పోవ‌డం అనేది త‌ర్వాత సంగ‌తి. ముందుగా శ‌త్రువును భ‌య‌పెట్టేది ఇలాంటి ఆయుధం మ‌న‌ద‌గ్గ‌ర ఉండ‌డం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌స్తుత జియో పాలిటిక్స్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.

అత్యంత క‌చ్చిత‌త్వం..

ఖండాంత‌ర క్షిప‌ణులు.. ఒక ఖండం నుంచి వేరే ఖండానికి ప్ర‌యోగించ గ‌ల రేడియ‌స్. అంటే, వేలాది కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల సామ‌ర్థ్యం. అంతేకాదు, అత్యంత క‌చ్చిత‌త్వం. గైడెడ్ వ్యూహాత్మ‌క వ్య‌వ‌స్థ‌. శ‌త్రు భూభాగంలోని క‌ఠిన ల‌క్ష్యాల‌ను ఛేదించ‌గ‌ల.. యుద్ధ ల‌క్ష్యాల‌ను తుద‌ముట్టించే స‌త్తా ఉన్న‌దే ఇజ్రాయెల్ భీక‌ర క్షిప‌ణి. ఇలాంటి వాటిపై చాలా దేశాలు ఇప్పుడు ఫోక‌స్ పెట్టాయి.

ర‌క్ష‌ణ ఛత్రం

ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో హ‌మాస్ ఉగ్ర‌వాదులు ప్ర‌యోగించిన క్షిప‌ణుల‌ను ఆ దేశ ఐర‌న్ డోమ్ అత్యంత స‌మ‌ర్థంగా నిలువ‌రించింది. గ‌త ఏడాది ఏప్రిల్ లో పెహ‌ల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల దారుణ మార‌ణ కాండ అనంత‌రం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలోనూ డోమ్ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ర‌ష్యా నుంచి తీసుకున్న ఎస్-400 క్షిప‌ణి ర‌క్ష‌క వ్య‌వ‌స్థ ఎంత స‌మ‌ర్థంగా ప‌నిచేసిందో చూశాం.

ధురంధ‌ర్ గోల్డెన్ హారిజ‌న్

ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయ‌నున్న గోల్డెన్ హారిజన్ ఒక విధంగా చెప్పాలంటే ధురంధ‌ర్ అనుకోవాలి. శ‌త్రు స్థావ‌రాల‌ను స‌మూలంగా మార్చ‌గ‌ల‌దు కాబ‌ట్టే, దీనికి అంత పేరు. ప్ర‌స్తుతం అన్ని దేశాలు త‌మ స్థావ‌రాల‌ను అత్యంత స‌మ‌ర్థంగా నిర్మించుకున్న నేప‌థ్యంలో హారిజ‌న్ ప్రాధాన్యం ఏమిటో తెలుస్తోంది.

గాలి నుంచి గాల్లోకి..

గోల్డెన్ హారిజ‌న్.. గాలి నుంచి గాల్లోకి ప్ర‌యోగించే బాలిస్టిక్ క్షిప‌ణి. అత్యంత వేగంగా ల‌క్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీనిని అడ్డుకోవ‌డం సాధార‌ణ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌కు సాధ్యం కాదు. ఇండియ‌న్ ఫోర్స్ లోకి అలాంటిది చేర‌డం అంటే గొప్ప విష‌యంగానే చెబుతున్నారు.