భారీగా దిగివస్తున్న బంగారం ధరలు.. 22 క్యారెట్ల గోల్డ్ ఎంతంటే?
తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2,340 తగ్గి రూ. 1,23,280 దగ్గర కొనసాగుతోంది.
By: Madhu Reddy | 27 Oct 2025 8:31 PM ISTబంగారానికి ఏ దేశంలో చూసినా వ్యాల్యూ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇండియాలో బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పసిడిని చాలామంది ఆస్తులుగా భావిస్తారు కూడా. ఇండియాలో మహిళలైతే ఏదైనా ఫంక్షన్ లేదంటే ఏదైనా పండగ సందర్భంగా తప్పకుండా ఒంటినిండా బంగారం ధరిస్తారు.. ఈ విధంగా మహిళలు బంగారానికి ఎక్కువగా వ్యాల్యూ ఇస్తారు. స్త్రీలే కాదు పురుషులకు కూడా బంగారం అంటే ఎక్కువగానే ఇష్టం ఉంటుంది.. ఈ మధ్యకాలంలో కొంతమంది పురుషులు మెడ నిండా బంగారం, చేతులకు పూర్తిగా బంగారపు ఉంగరాలు ధరించి గోల్డ్ మ్యాన్ లా తయారవుతున్నారు. ఈ విధంగా బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడడం వల్ల అది రోజు రోజుకు ధర పెరుగుతూ పోతుంది..
కేవలం పసిడికే కాకుండా వెండికి కూడా ఈ విధంగానే వ్యాల్యూ ఉంది.. స్త్రీలు బంగారంతో పాటు వెండి పట్టీలు, వెండి గొలుసులు లాంటివి వాడుతూ ఉంటారు.. బంగారంకి ఏ విధంగా ప్రయారిటీ ఉంటుందో దానిలో కాస్త తక్కువ ప్రయారిటీని వెండికి ఇస్తారు. అందుకే బంగారం, వెండి కి మార్కెట్ లో అత్యధిక రేట్లు ఉన్నాయి.. మరి అలాంటి బంగారం, వెండి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి.. ఎలా తగ్గుతున్నాయి అనే వివరాలు చూద్దాం.. ప్రస్తుతం పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు రాబోతున్నాయి. దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఇదే సమయంలో దీపావళి తర్వాత బంగారం రేట్లు కూడా దిగి వచ్చాయి.. 10 గ్రాముల బంగారంకు దాదాపుగా 7000 తగ్గింది. ప్రస్తుత బంగారం ధరలు చూస్తే కాసేపు క్రితం మళ్లీ తగ్గాయి. తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2,340 తగ్గి రూ. 1,23,280 దగ్గర కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,150 తగ్గి రూ..1,13,000 నమోదయింది.. ఇక వెండి ధర మాత్రం క్రితం రోజు కిలో ధర ₹1,70,000 కొనసాగుతోంది. ఇదే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి..
దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడం, ఇన్వెస్టర్స్ లాభాలకు ప్రయత్నించడంతో బంగారం ధరలు తగ్గుదలకు వస్తున్నాయి. ఇండియాతో సహా వివిధ దేశాలకు సంబంధించిన టారిఫ్ ల విషయంలో అమెరికా సానుకూలంగా స్పందించవచ్చన్న సంకేతాలు కూడా బంగారం రేట్లు పడిపోయేందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోవు పెళ్లిళ్ల సీజన్ వరకు ఇంకాస్త బంగారం ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త రిలీఫ్ అవుతుందని చెప్పవచ్చు.
