పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా పడిపోయిన బంగారు ధరలు.. !
ఇంటర్నేషనల్ మార్కెట్లో నిన్నటి రోజున ఔన్స్ ధర $245 రూపాయలు తగ్గడమే ఇందుకు కారణమని, నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 22 Oct 2025 1:07 PM ISTగత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో తాజాగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
బంగారం కొనాలనుకునే వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3,380 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు బంగారం ధర రూ. 1,27,200 రూపాయల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే రూ. 3,100 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ. 1,16,600 చేరుకుంది.
అయితే బంగారం ధర ఒక్కసారిగా ఇంత మొత్తంలో తగ్గడానికి ముఖ్య కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో నిన్నటి రోజున ఔన్స్ ధర $245 రూపాయలు తగ్గడమే ఇందుకు కారణమని, నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇక కేజీ వెండి పైన కూడా 2000 రూపాయలు వరకు తగ్గడంతో 1,80,000 కు చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,570 70 రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,690 రూపాయలుగా ఉన్నది.
హైదరాబాద్ విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,570 రూపాయలు కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,690 రూపాయలు కలదు. ఏది ఏమైనా పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
నిజానికి గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు కూడా ఎప్పుడో బంగారం కొనుగోలు చేయడం ఆపేశారు. ఇక ధనవంతుడు కూడా బంగారం వైపు చూడాలంటేనే కాస్త భయపడిపోతున్నారు. అంతలా ఆకాశాన్ని అంటిన బంగారం ఇప్పుడు పెళ్లిళ్ల సమయంలో తగ్గుముఖం పట్టడంతో అందరూ కాస్త ఊపిరి తీర్చుకుంటున్నారు.
