Begin typing your search above and press return to search.

దశాబ్దకాలంలో ఏకంగా లక్ష పెరిగిన బంగారం ధర.. ఈ మార్పు గమనించారా?

ఎందుకంటే బంగారం ధర పెరగడం తప్ప తగ్గడం అన్నది లేదు. పెరిగితే వేలల్లో పెరుగుతుంది.. తగ్గితే 100 లలో తగ్గుతుంది.

By:  Madhu Reddy   |   24 Sept 2025 2:21 PM IST
దశాబ్దకాలంలో ఏకంగా లక్ష పెరిగిన బంగారం ధర.. ఈ మార్పు గమనించారా?
X

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ప్రతి ఒక్కరికి ఇష్టమే.. ముఖ్యంగా ఆడవాళ్ళకి బంగారం అంటే ఒక ఎమోషన్ లాంటిది..బంగారం లేకపోతే ఆడవాళ్లు అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఒంటినిండా బంగారు నగలు వేసుకొని వెళ్లడానికే ఇష్టపడతారు. బంగారం లేకపోతే ఎంత చీప్ గా చూస్తారో చెప్పనక్కర్లేదు.అందుకే ఆడవాళ్లు అప్పు చేసైనా సరే ఒంటినిండా బంగారం వేసుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే బంగారం మీద ఇష్టం ఉండడం మంచిదే.కానీ బంగారం ధరలు చూస్తూ ఉంటే మాత్రం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గుండె ఆగినంత పని అవుతుంది. రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు చూస్తే సామాన్య మానవుడు భవిష్యత్తులో బంగారం అంటే అలా ఉండేది అని మాట్లాడుకోవాల్సి వస్తుందేమో అనేంతలా పరిస్థితి తయారయింది.

ఎందుకంటే బంగారం ధర పెరగడం తప్ప తగ్గడం అన్నది లేదు. పెరిగితే వేలల్లో పెరుగుతుంది.. తగ్గితే 100 లలో తగ్గుతుంది. దాంతో బంగారం కొనే వారికి రోజురోజుకు పెరిగే ధరలు షాకిస్తున్నాయి.గత పది ఏళ్ల నుండి బంగారం ధర ఏకంగా లక్ష వరకు పెరిగింది. ఇక చివరి 9 నెలల్లో చూసుకుంటే ఏకంగా బంగారం ధర 44 వేలకు ఎగబాకింది.. ఎందుకంటే గతేడాది చివర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,000 ఉండేది.కానీ ఇప్పుడు అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ ఏకంగా లక్షా 16 వేలకు చేరింది.ఈ లెక్కన చూసుకుంటే గత తొమ్మిది నెలల్లోనే బంగారం ధర 44 వేలకు ఎగబాకింది. అంటే బంగారం ధర ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇక ఒకప్పుడు అంటే 1970లో 10 గ్రాముల బంగారం ధర 184 రూపాయలు ఉండేది. ఆ తర్వాత 1975 వ సంవత్సరంలో 540 వరకు ధర పెరిగింది.ఆ తర్వాత 2005లో ఏకంగా 7000 కు చేరింది.ఇక 2015 సంవత్సరానికి వచ్చేవరకు 26,343 రూపాయలకు ఎగబాకింది. ఇక 2020లో 50 వేలకు పాకిన బంగారం ధర కరోనా కారణంగా 36 వేలకు దిగొచ్చింది.ఆ తర్వాత మళ్లీ ధరలు పెరుగుతూనే ఉంది..ప్రస్తుతం బంగారం ధర లక్షా 16 వేలకు చేరుకుంది అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 10 గ్రాముల బంగారానికి 44,000 పెరిగింది.

అలాగే ఈ 10 సంవత్సరాలలో బంగారం ధర దాదాపు లక్షకు చేరువైంది. అలాగే 2030 నాటికి బంగారం ధర ఏకంగా 1,50,000 నుండి రెండు లక్షల వరకు పెరిగే ఛాన్స్ కూడా ఉంది అని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బంగారం కొనాలి అంటే ఆస్తులు అమ్మేయాల్సిందే అనే వార్తలు వినిపిస్తున్నాయి.