Begin typing your search above and press return to search.

జీఎంఆర్.. ఇది పేరు కాదు బ్రాండ్.. దీని హిస్టరీ చూస్తే..

ప్రస్తుతం జీఎంఆర్ గ్రూప్ భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 9 అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల నిర్మాణం లేదా నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది.

By:  A.N.Kumar   |   3 Aug 2026 11:12 AM IST
జీఎంఆర్.. ఇది పేరు కాదు బ్రాండ్.. దీని హిస్టరీ చూస్తే..
X

భారత మౌలిక వసతుల రంగంలో అత్యంత ప్రముఖమైన పేరు జీఎంఆర్ గ్రూప్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భారత ప్రైవేట్ రంగానికి గర్వకారణంగా నిలిచింది. కేవలం దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి భారతీయ మేధస్సుకు, నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా 9 కీలక విమానాశ్రయాలు

ప్రస్తుతం జీఎంఆర్ గ్రూప్ భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 9 అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల నిర్మాణం లేదా నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందించడం, విమానాశ్రయ మౌలిక వసతులను ఆధునీకరించడంలో ఈ సంస్థ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

దేశీయంగా జీఎంఆర్ అభివృద్ధి చేసిన ఎయిర్‌పోర్టులు

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అత్యంత రద్దీగల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది. ఇక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో నిర్మించింది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలు కలిగిన విమానాశ్రయాల్లో ఒకటి. తర్వాత మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం గోవాలోని మోపాలో నిర్మించింది. ఇటీవల ప్రారంభమై పర్యాటకులకు సేవలు అందిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది. ఇటీవలే మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్ట్ ప్రారంభమైంది. ఇక నాగ్‌పూర్ విమానాశ్రయం (మహారాష్ట్ర), బీదర్ విమానాశ్రయం (కర్ణాటక) లను నిర్మించింది.

అంతర్జాతీయ ప్రాజెక్టులు

భారత్‌కే పరిమితం కాకుండా విదేశీ గడ్డపై కూడా జీఎంఆర్ తన సత్తా చాటుతోంది. ఫిలిప్పీన్స్ (మాక్తాన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయం) , ఇండోనేషియా (కువాలనాము అంతర్జాతీయ విమానాశ్రయం) , గ్రీస్ (క్రీట్ లోని కాస్టెల్లి విమానాశ్రయం) లను నిర్మించి నిర్వహిస్తోంది.

సాధారణ కుటుంబం నుండి గ్లోబల్ లీడర్ వరకు జీఎం రావు ప్రస్థానం

ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్థాపకుడు, వ్యాపార దిగ్గజం గ్రంధి మల్లికార్జున రావు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రాజాం. అత్యంత నిరాడంబరమైన వాతావరణంలో, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జి.ఎమ్. రావు తన కఠిన శ్రమ, నిబద్ధత, భవిష్యత్తు విజన్ తో జీఎంఆర్ గ్రూప్‌ను దేశంలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల సంస్థగా తీర్చిదిద్దారు.

జీఎంఆర్ గ్రూప్ కేవలం విమానాశ్రయాలకే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో కూడా తన సేవలందిస్తోంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబల్ స్టాండర్డ్స్, పర్యావరణహిత పద్ధతులతో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో జీఎంఆర్ గ్రూప్ ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. ప్రపంచ వేదికపై భారతీయ మౌలిక వసతుల రంగ ప్రతిష్టను నానాటికీ పెంచుతూ భవిష్యత్ తరం వ్యాపారవేత్తలకు జీఎం. రావు ప్రస్థానం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.