అయ్యప్ప సెంట్రిక్‌గా.. కేరళలో మత రాజకీయం..!
ఈ నేపథ్యంలో పవిత్ర పంబా నది సమీపంలో `అగోలా అయ్యప్ప సంగమం` పేరుతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.
By: Garuda Media | 20 Sept 2025 11:00 PM ISTకేరళ అంటే.. మూడు కీలక విషయాలు తెరమీదికి వస్తాయి. 1) కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం. 2) విద్యాధికులైన ప్రజలు(అక్షరాస్యత) ఎక్కువగా ఉన్న రాష్ట్రం. 3) అయ్యప్ప కొలువైన శబరిమల దేవస్థానం. ఈ మూడు విషయాలు తరచుగా చర్చకు వస్తూనే ఉంటాయి. వీటితోపాటు.. ప్రకృతి సౌందర్యానికి కేరళ కేరాఫ్, అదేవిధంగా క్రిస్టియానిటీ జోరుగా పెరుగుతున్న రాష్ట్రం కూడా ఇదే కావడం గమనార్హం. అయితే.. తాజాగా ఇక్కడ తీవ్ర స్థాయిలో మత వివాదం చోటు చేసుకుని.. అది మత రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది.
విషయం ఏంటి?
సుప్రశిద్ధ శబరిమల ఆలయాన్ని పరిరక్షించేందుకు, నిర్వహించేందుకు.. `ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్` ఉన్న విష యం తెలిసిందే. ఆలయాన్ని ఎలా నిర్వహించాలి? ఎలాంటి పద్దతులు పాటించాలి? ఏటా ప్రపంచం నలుమూ లల నుంచి వచ్చే స్వామి మాల ధారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? ప్రసాదాలు.. పద్ధతులు.. ఇలా అన్ని రూపాల్లోనూ అప్పయ్య స్వామి ఆలయానికి సంబంధించి వ్యవహారాలను ఈ బోర్డు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇక, ఈ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఏర్పడి.. సెప్టెంబరు 20(శనివారం) నాటికి 75 సంవత్సాలు పూర్తి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పవిత్ర పంబా నది సమీపంలో `అగోలా అయ్యప్ప సంగమం` పేరుతో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పినరయి విజయన్ హాజరు కానున్నారు. అంగరంగ వైభవంగా సాగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. ఇక్కడే బీజేపీ తీవ్ర వివాదానికి తెరదీసింది. నాస్తికుడు, కమ్యూనిస్టు అయిన.. పినరయి విజయన్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఏంటి? అయితే గియితే.. విశ్వహిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్న ప్రధాని మోడీని కదా పిలవాలి? అనే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చింది.
ఫలితంగా శుక్రవారం రాత్రి నుంచే కేరళలో రవాణా సేవలు నిలిచిపోయాయి. అంతేకాదు.. పంబా తీరానికి వెళ్లే మా ర్గాలను కూడా బీజేపీ నాయకులు.. ఈ పార్టీకే చెందిన నిరంతర స్వామి మాలధారులు కూడా మూసిసి.. ఉద్యమిస్తు న్నారు. అయితే.. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాస్తికుడు, ఆస్తికుడు అనే తేడా లేకుండా.. స్వామికి అందరూ భక్తులేనని.. ఆయన పట్ల విశ్వాసం ఉన్న వారు చాలా మంది ఉన్నారని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చెబుతోంది. అంతేకాదు.. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా పేర్కొంటోంది. అయినప్పటికీ.. బీజేపీ పార్టీ నాయకులు, ఆ పార్టీ తరఫున గెలిచి.. కేంద్ర మంత్రిగా ఉన్న నటుడు కూడా.. ఈ నిర్ణయాన్ని, కార్యక్రమాన్ని కూడా తప్పుబడుతున్నారు. దీంతో పంబా తీరంలోను.. కార్యక్రమం నిర్వహించే ప్లేస్‌లోనూ.. తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
