Begin typing your search above and press return to search.

ప్రపంచంలో ఎటు చూసినా వృద్ధులేనట...అసలు ఊహించగలరా ?

ప్రకృతిలో భాగం మానవాళి కూడా. అక్కడ అన్ని రకాలైన వర్గీకరణలు ఉన్నట్లుగా మానవాళిలోనూ అన్ని రకాలైన వయసు వారు ఉండాలి.

By:  Satya P   |   8 Sept 2026 8:59 AM IST
ప్రపంచంలో  ఎటు చూసినా  వృద్ధులేనట...అసలు ఊహించగలరా ?
X

ప్రకృతిలో భాగం మానవాళి కూడా. అక్కడ అన్ని రకాలైన వర్గీకరణలు ఉన్నట్లుగా మానవాళిలోనూ అన్ని రకాలైన వయసు వారు ఉండాలి. అపుడే సృష్టికి అందం, ప్రపంచానికి అభివృద్ధికి అదే కీలకం. అందరూ యువత అయితే ఆవేశం తప్ప ఏమీ మిగలదు, అదే అంతా వృద్ధులు అయితే నైరాశ్యం తప్ప ఉండేది లేదు. అందుకే సమతుల్యమైన జనాభా అంటే అనుభవం కలిగిన వృద్ధులతో పాటు వేడి నెత్తురు కలిగిన యువత కూడా. ఇప్పటిదాకా అలాగే సాగుతూ వచ్చింది కానీ ఇపుడు ఆ గొలుసుకట్టు ఎక్కడో తెగిపోతోంది. ఆ వరసలో తేడా వస్తోంది. ఫలితంగా రానున్న కాలమంతా వృద్ధులదే అవుతోంది. ప్రపంచమే అతి పెద్ద వృద్ధ సమాజంగా మారబోతోంది. తలచుకుంటేనే ఇది ఒకింత కలవరం కలిగిస్తోంది. ఊహకు అందని విధంగా కూడా ఈ ఆవిష్కరణ ఉంది. కానీ ఇదే జరగబోతోంది అని పలు నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచ చరిత్రలోనే తొలిసారి :

ఈ విధంగా వృద్ధ సమాజం ఆవిష్కరించబడడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని అంటున్నారు. అయిదేళ్ల చిన్నారులను మించిన విధంగా వృద్ధులు జనాభా ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇదంతా చాలా నిశ్శబ్దంగా వేగంగా ఇపుడు జరిగిపోతుంది అని అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒక వైపు చూస్తే మానవాళి జీవన ప్రమాణాలు పెరిగాయి. అదే సమయంలోనె జననాలు తగ్గిపోతున్నాయి. ఈ రెండింటి నిష్పత్తిలో భారీ అంతరాయం వల్లనే వృద్ధులు పెరిగి యువత తగ్గిపోతున్న నేపథ్యం ఉందని అంటున్నారు.

అందోళనకరమైనా కూడా :

వయో వృద్ధులు ఉన్న దేశాలు అతి తొందరలోనె నూటికి తొంబైగా ఉంటాయని అమెరికాకు చెందిన యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన యాన్ ఏజింగ్ వరల్డ్- 2025' నివేదిక వెల్లడిస్తోంది. ఈ నివేదిక ప్రకారం చూస్తే అయిదేళ్ల చిన్నారుల కంటే కూడా ప్రపంచంలో 65 ఏళ్లు పైబడిన వారు అధికంగా ఉన్నారని నమోదు అయింది. ఇక ఇదే తీరున అనేక దేశాలలో వేగంగా వృద్ధుల జనాభా పెరిగిపోతోంది అని అంటున్నారు. ఇప్పటికే ఇలా ఉంటే భవిష్యత్తులో మరింత వేగంగా వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ప్రపంచా దేశాలలో ఆర్ధిక వృద్ధి నిలిచిపోవడమే కాకుండా అభివృద్ధి సైతం కుంటుపడుతుందని అంటున్నారు. అలాగే సామాజిక వ్యవస్థకు కూడా ఈ పరిణామం అతి పెద్ద సవాల్ గా మారనుంది అని అంటున్నారు.

లెక్కలు ఇలాగేనా :

ఇక యాన్ ఏజింగ్ వరల్డ్- 2025 నివేదిక ప్రకారం చూస్తే కనుక 2025 నాటికే ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 85.2 కోట్లుగా ఉంది. అయితే ఇది ఉండనుండగా, 2060 నాటికి అది ఏకంగా 200 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక సరిగ్గానే అంచనా వేసింది. దీనిని బట్టి చూస్తే మరో మూడున్నర దశాబ్దాల నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే ఉంటారని లెక్క తేలుతోంది. అంటే వృద్ధ సమాజమే ఎటు చూసినా కనిపిస్తుంది అన్న మాట. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు తాముగా మానవ వనరులను తగ్గించేసుకుంటాయని అంటున్నారు.

రెండు కీలక కారణాలు :

ఎందుకు తొందరగా వృద్ధ ప్రపంచం ఆవిష్కరించబడుతోంది అంటే రెండు కారణాలను కీలకంగా ఈ నివేదిక ప్రకారం గుర్తించారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గడం అని స్పష్టం చేస్తున్నారు. ఈ రోజున ప్రపంచం మైండ్ సెట్ ఎలా ఉంది అంటే కుటుంబాలు పెద్దవి వద్దు తక్కువ మంది పిల్లలే చాలు అన్నట్లుగా తయారైంది. ఈ విధంగా చూస్తే ప్రపంచ జనాభాలో 71 శాతానికి పైగా ప్రజలు నివసిస్తున్న దేశాలలో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోయింది. ఒక మహిళకు సగటున 2.1 జననాలు కంటే దిగువకు పడిపోయిందని చెబుతున్నారు. ఇక రెండవ కారణం చూస్తే అన్ని దేశాలలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ విధానాలు అమలు అవుతున్నాయి. దాంతో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల ప్రజల ఆయుర్దాయం ఒక్కసారిగా అధికం అయింది. దాంతోనే వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని నివేదిక పేర్కొంటోంది.

భారత్ మీదనే ప్రభావం :

ఈ విధంగా వృద్ధ సమాజం ఏర్పడితే అది అతి పెద్ద దేశాలుగా ఉన్న భారత్ చైనాల మీదనే ప్రభవాం పడుతుంది అని అంటున్నారు. అంతే కాదు అధిక వృద్ధుల పెరుగుదల కూడా ఆసియా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ఈ రెండు దేశాల్లోనూ ఇప్పటికే సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంది అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 35 కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉంది. అలాగే . ఆసియా మొత్తంలో 2060 నాటికి వృద్ధుల జనాభా 120 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం సంపన్న దేశాలకే కాకుండా ఆఫ్రికా లాంటి ఖండాల్లోనూ 2060 నాటికి వృద్ధుల సంఖ్య 249 కోట్లకు చేరుతుందని కూడా ఈ నివేదిక ప్రకారం అంచనా వేశారు. ఇలా వృద్ధులు పెరిగితే కనుక అధి దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను ముప్పుగా మారుతుందని అంటున్నారు. మానవ వనరుల కొరతకు దారి తీస్తుందని అంటున్నారు.