కరెక్ట్ డేట్ చూసి మరీ గిగ్ వర్కర్ల సమ్మెట పోటు
ఇక 31వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీకే ఆర్డర్లు వస్తాయి. ఆహార పదార్ధాలను ఆర్డర్ చేసే వారు అత్యధికంగా ఉంటారు.
By: Satya P | 28 Dec 2025 12:01 AM ISTగిగ్ వర్కర్లు సరైన సమయం చూసి మరీ సమ్మెకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా వారు సమ్మె చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దానికి డిసెంబర్ 31వ తేదీని ఎంచుకున్నారు. కొత్త ఏడాదికి పాత ఏడాదికి వారధిగా ఉన్న ఈ డేట్ నే ఎంచుకుని మరీ గిగ్ వర్కర్స్ సమ్మెకు సిద్ధపడుతున్నారు అంటే తమ శక్తి ఏమితో చూపించడానికే అని అంటున్నారు. న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ దేశమంతా ఆ రోజు పార్టీలు చేసుకుంటుంది. దాంతో మొత్తానికి మొత్తం వ్యాపారం అంతా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు.
వీరంతా సమ్మెలోనే :
స్విగ్లీ, జొమాటో, బ్లింకింట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జెప్టోతో పాటు ఈ కామర్స్ కి చెందిన మొత్తం గిగ్ వర్కర్లు అంతా సమ్మె బాట పట్టారు. దీంతో ఈ సమ్మె ప్రభావం అధికంగా ఉండబోతోంది. దేశమంతా ప్రతీ రోజూ వీరి మీదనే ఆధారపడుతున్న కల్చర్ ఉంది. ఇక 31వ తేదీ అయితే పూర్తిగా ఉంటుంది. దాంతో ఎక్కడికక్కడ డెలివరీలు నిలిచిపోతాయని అంటున్నారు. ఒక్క రంగం అని కాకుండా మొత్తం రంగాల మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. గిగ్ వర్కర్ల సమ్మెతో ముఖ్యంగా హొటళ్ళు, రెస్టారెంట్లు అన్నింటి మీద తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా సూపర్ మార్కెట్లు వివిధ కూరగాయల మార్కెట్ల మీద కూడా ఈ సమ్మె ప్రభావం ఉండబోతోంది.
ఇవన్నీ బంద్ :
ఇక 31వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీకే ఆర్డర్లు వస్తాయి. ఆహార పదార్ధాలను ఆర్డర్ చేసే వారు అత్యధికంగా ఉంటారు. ఈ సమ్మెతో అవన్నీ బంద్ అవుతాయని దాంతో ఫుడ్ స్టాల్స్ తో పాటు రెస్టారెట్లు హొటళ్ళు తీవ్రంగా నష్టాలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇందులో కూడా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకింట్ వంటి వాటి మీద అత్యధికమైన ప్రభావం ఉంటుంది అని అంటున్నారు.
డిమాండ్లు ఇవే :
ఇదిలా ఉంటే గిగ్ వర్కర్లు తమ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వం ముందు పెడుతున్నారు. తమకు పని ఒత్తిడి అధికంగా ఉందని ఆదాయాలు చూస్తే పడిపోయాయని చెబుతుజ్ఞారుఇ. ఇక తమకు సామాజిక భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ లేదని వారు అంటున్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ తో పాటు ఆలిండియా గిగ్ వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దేశంలో ఈ రోజు లక్షలలో పనిచేస్తునారు. వీరికి అరకొర జీతాలు అలాగే వీరు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మరి వీరి కష్టాలు తీర్చాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది అని అంటున్నారు.
