వీసా లేకుండా జర్మనికి.. ఇండియన్స్ కు గుడ్ న్యూస్
భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. పాస్ పోర్ట్ ఉన్న భారతీయు వీసా లేకుండానే జర్మనీ ఎయిర్ పోర్టుల ద్వారా విదేశీ ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది.
By: A.N.Kumar | 15 Jan 2026 4:00 AM ISTభారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. పాస్ పోర్ట్ ఉన్న భారతీయు వీసా లేకుండానే జర్మనీ ఎయిర్ పోర్టుల ద్వారా విదేశీ ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఈ ప్రకటన ఉన్నత స్థాయి చర్చల అనంతరం వెలువడింది. భారత ప్రధాని మెదీ, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. దీని వల్ల భారతీయుల విదేశీ ప్రయాణాలు సులభంగా మారుతాయి. సుదూర ప్రయాణాలు చేసే వారికి జర్మనీ స్టాపోవర్ గా మారనుంది. దీంతో పాటుగా కనెక్టివీటీ పెంచి, పేపర్ వర్క్ ను తగ్గించి, ప్రయాణం సులభం అవుతుంది.
వీసా ఫ్రీ ట్రాన్సిట్ అంటే..
ఉదాహరణకు అమెరికా వెళ్లాలనుకుంటే.. నేరుగా ఇండియా నుంచి అమెరికా వెళ్లకుండా జర్మనీలో విమానం దిగి.. అక్కడ నుంచి అమెరికా వెళ్లే విమానం ఎక్కాలనుకుంటే జర్మనీలో ట్రాన్సిట్ వీసా చూపించాలి. కానీ తాజా నిబంధలనతో జర్మనీలో ట్రాన్సిట్ వీసా చూపాల్సిన అవసరం లేదు. భారతీయులు ట్రాన్సిట్ వీసా లేకుండా జర్మనీ ఎయిర్ పోర్టుల నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చు. అయితే ఇందులో కూడా కొన్ని నిబంధనలకు లోబడి ప్రయాణాలు ఉండాలి. జర్మనీలోని ఫ్రాన్క్ఫర్ట్ , మునిచ్ నగరాలు ముఖ్యమైన గ్లోబల్ ట్రాన్సిట్ హబ్ లుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి భారతీయులు ట్రాన్సిట్ వీసా లేకుండా యూరప్, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా దేశాలకు వెళ్లవచ్చు.
భారతీయులకు లాభం ఏంటి ?
వీసా ఫ్రీ ట్రాన్సిట్ ద్వారా భారతీయుల విదేశీ ప్రయాణాలు సులభతరంగా ఉంటాయి. చాలా ఇబ్బందులను తొలగిస్తాయి. చాలా వరకు పేపర్ వర్క్ తగ్గుతుంది. ఇది ప్రయాణాల సందర్భంగా ఇబ్బంది కలిగించే అంశం. పేపర్ వర్క్ లేకపోవడం ప్రయాణాలను సులభం చేస్తుంది. ఆలస్యాన్ని, ఖర్చును తగ్గిస్తుంది. భారత్ నుంచి చదువు కోసం, బిజినెస్ కోసం, టూర్ల కోసం చాలా మంది జర్మనీ వెళ్తుంటారు. జర్మనీ మీదుగా వెళ్తుంటారు. వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులువుగా మార్చుతుంది. ఈ నిర్ణయం కారణంగా ఎయిర్ ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ వృద్ధి వేగంగా జరుగుతుంది.
