హ్యాష్‌ట్యాగ్‌ల నుంచి హోరు దాకా: 2025ను వణికించిన 'జెన్-జెడ్' విప్లవం!
2025 వ సంవత్సరం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాకే పరిమితం అనుకున్న జెన్ జెడ్ యువత ఈ ఏడాది అసాధారణ పోరాటపటిమను ప్రదర్శించింది.
By: A.N.Kumar | 30 Dec 2025 5:00 AM ISTజెన్ జెడ్.. ఇప్పుడు ఈ పేరే ఒక సంచలనం.. దేశాల రాజకీయ చరిత్రను మార్చే యువతరం అసలు సిసలు ఆవేశాన్ని చూపితే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఈ ఏడాది తెలిసి వచ్చింది.. మొదట బంగ్లాదేశ్ ఆ తర్వాత నేపాల్.. పాకిస్థాన్లో నవతరం యువత తలుచుకుంటే ఏం జరుగుతుందనేది ఈ సంవత్సరం అందరికీ కళ్లకు కట్టింది ఏకంగా ప్రభుత్వాలనే కూల్చింది.
2025 వ సంవత్సరం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాకే పరిమితం అనుకున్న జెన్ జెడ్ యువత ఈ ఏడాది అసాధారణ పోరాటపటిమను ప్రదర్శించింది. కీబోర్డ్ అక్షరాలను ఆయుధాలుగా షార్ట్ వీడియోలను క్షిపణులుగా మలిచి నేపాల్ నుంచి మెక్సికో వరకు వ్యవస్థలను కుదిపేసింది.
డిజిటల్ శక్తి.. రోడ్లపై పోరు..
టిక్ టాక్ రీల్స్ , ఇంస్టాగ్రామ్ లైవ్ స్ట్రీములు.. ఏఐ సాయంతో రూపొందించిన గ్రాఫిక్స్ యువతను ఏకం చేశాయి. అవినీతి నిరుద్యోగం పాలకుల నిర్లక్ష్యంపై జెన్ జెడ్ ఎక్కుపెట్టిన విమర్శలు చివరకు ప్రభుత్వాల పతనానికి దారితీసాయి.
ప్రపంచాన్ని కుదిపేసిన ప్రధాన ఉద్యమాలు..
నేపాల్ : మొదటగా నేపాల్ లో అవినీతి కోటలు బద్దలయ్యాయి. నేపాల్ లో ప్రారంభమైన యూత్ అగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఐదు కోట్ల వ్యూస్ తో ప్రకంపనలు సృష్టించింది. 40 శాతం యువత నిరుద్యోగంతో ఉన్న సమయంలో దేశ ఆర్థిక మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిప్పు రాజేశాయి. రాజధాని కాట్మండు వీధుల్లో రెండు లక్షల మంది యువత కదం తొక్కడంతో ప్రధాని గద్దె దిగాక తప్పలేదు. ప్రస్తుతం అక్కడ యువ నాయకత్వంతో కూడిన కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.
మడగాస్కార్ : ఆహార ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభంపై మడగాస్కర్ యువత గళమెత్తింది. రాజధానిలో లక్షన్నర మందితో చేసిన ప్రదర్శనలకు ప్రభుత్వం తలవంచింది. ఫలితంగా మడగాస్కర్ పార్లమెంట్లో జెన్ జెడ్ ప్రతినిధులకు 30 శాతం సీట్లు దక్కడం విశేషం.
మెక్సికో : డ్రగ్స్ మాఫియా పోలీస్ అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం మెక్సికో రాజకీయ రూపురేఖలని మార్చేసింది. మెక్సికో సిటీలో ఐదు రోజులపాటు సాగిన నిరసన ఫలితంగా జరిగిన ఎన్నికల్లో ఒక జెన్ జెడ్ అభ్యర్థి ఏకంగా 52 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి సంచలనం సృష్టించారు.
మొరాకో : చబాబ్ మెహ్రాబ్ పేరుతో సాగిన ఉద్యమం యువతకు ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రభుత్వంలో యువ మంత్రి పదవిని ఏర్పాటు చేయడమే కాకుండా డిజిటల్ ఎకానమీ పథకాలను ప్రవేశపెట్టేలా యువత ఒత్తిడి తెచ్చింది.
ఈ ఉద్యమాల ఉధృతిని చూసి భారత్ ఫ్రాన్స్ లాంటి దేశాలు సోషల్ మీడియా నియంత్రణలపై దృష్టి సారించాయి. ఇంటర్నెట్ షట్ డౌన్ లు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ డిజిటల్ యువత ఫోరమ్ ను ఏర్పాటు చేసి యువతతో చర్చలు ప్రారంభించడం విశేషం.
2030 నాటికి ప్రపంచ ఓటర్లలో 40 శాతం మంది జెన్ జెడ్ ప్రతినిధులే ఉంటారు. వారి ఆశలు ఆకాంక్షలను గుర్తించని ప్రభుత్వాలకు భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదు . ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు
