Begin typing your search above and press return to search.

డేటింగ్ లో కొత్త ట్రెండ్.. 10/10 వద్దు, 6-7/10 ముద్దు!

అవును... ఈ డేటింగ్ ప్రపంచంలో భాగస్వామిని స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ లలో కలవచ్చు. ఈ క్రమంలో అవతలి వ్యక్తికి అన్ని విషయాల్లోనూ 10/10 ఉండలని కోరుకుంటారు.

By:  Raja Ch   |   8 Feb 2026 7:00 PM IST
డేటింగ్  లో కొత్త ట్రెండ్.. 10/10 వద్దు, 6-7/10 ముద్దు!
X

సాధారణంగా టీనేజ్ లో ప్రతీ అమ్మాయికి, అబ్బాయికి తమ తమ పార్ట్ నర్స్ నవలల్లోనూ, సినిమాల్లోనూ కనిపించే అందమైన కలల రాకుమారుడు, రాకుమారిలాంటి ఆలోచనలు, కోరికలు ఉంటాయి! ఇది అత్యంత సమజమైన విషయం! అందంలోనూ, హోదాలోనూ, ఆస్తిపాస్తుల్లోనూ నెంబర్ వన్ అయిన వ్యక్తి భాగస్వామి కావాలని కోరుకుంటారు! తన భాగస్వామికి అన్ని విషయాల్లో 10కి 10 మార్కులు ఉండాలని ఆలోచిస్తారు. కట్ చేస్తే... డేటింగ్ ప్రపంచంలో జెన్-జెడ్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది.

అవును... ఈ డేటింగ్ ప్రపంచంలో భాగస్వామిని స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ లలో కలవచ్చు. ఈ క్రమంలో అవతలి వ్యక్తికి అన్ని విషయాల్లోనూ 10/10 ఉండలని కోరుకుంటారు. అయితే.. ఈ ఆలోచనలు కొత్తలో బాగున్నట్లు కనిపించినా.. కాలక్రమేణా తమతో పాటు అవతలి వ్యక్తిపై కూడా తెలియని ఒత్తిడి ఉంటుందని.. ఎవరూ అన్ని విషయాల్లోనూ పెర్ఫెక్ట్ గా ఉండటం సాధ్యం కాదని.. ఇది అర్ధం చేసుకుని 10కి 10 అవసరం లేదు 6 లేదా 7 పాయింట్లు ఉంటే చాలని అంటున్నారు.

దీన్నే 6-7 డేటింగ్ అంటున్నారు. ఈ క్రమంలో నవలల్లో కనిపించే ప్రేమలు, సినిమాల్లో కనిపించేలా అందమైన లొకేషన్స్ లో రొమాన్సులు వంటి ఊహల నుంచి బయటకు వచ్చి.. మానసిక ప్రశాంతత, భరోసా ఇస్తూ మన వరకూ మంచిగా, నమ్మకంగా ఉండే భాగస్వామి దొరికితే చాలాని జెన్-జెడ్ బలంగా భావిస్తుందని అంటున్నారు. దీనివల్ల ఇద్దరికీ ఒత్తిడి ఉండదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పర్ ఫెక్ట్ పార్ట్ నర్ అనే భ్రమలకు ఇక సెలవు పెట్టి అర్థం చేసుకునే భాగస్వామి చాలాని ఫిక్సయ్యారని చెబుతున్నారు.

దీనిపై స్పందించిన మానసిక నిపుణులు.. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఎవరూ 10/10 కాదని.. అది సాధ్యం కూడా కాదని.. తొలి చూపులో అలా కనిపించినా.. కాల క్రమంలో ఇది 6/10, 7/10, 8/10కి వెళ్తుందని.. అది తెలిసిన రోజు తాము భాగస్వామి ఎంపిక విషయంలో తప్పు చేశామని బాధపడుతూ, తీవ్ర ఒత్తిడిలోకి నెట్టబడతారని.. అందువల్ల మొదట్లోనే ఈ 6-7 పద్దతి బెటరని.. ఈ ట్రెండ్ ఉన్నంతలో సర్థుకుపోయే మనస్తత్వానికి సూచన అని అంటున్నారు!

ఈ 6-7 స్కేలులో ఉన్న భాగస్వామి ఉన్నంతలో శాంతి, దయ, విశ్వసనీయత, సౌకర్యాన్ని ప్రామిస్ చేస్తారని.. నిజ జీవితంలో 10/10 కోసం చూసి అలసిపోవడం కంటే ఇది మంచిదని చెబుతున్నారు! ఆ పోరాటం కంటే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం మంచిదని.. ఇది నిద్రలేని రాత్రులు, ఆందోళనలను దూరం చేస్తుందని అంటున్నారు!