Begin typing your search above and press return to search.

విషం చిమ్మిన చోటనే విజయం.. అమెరికాలో అదానీ కడిగిన ముత్యం..

తీర్పు అనంతరం గౌతమ్ అదానీ వ్యక్తంచేసిన ఈ భావోద్వేగ స్పందన.. దేశం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటిచెబుతోంది.

By:  A.N.Kumar   |   11 Aug 2026 11:59 AM IST
విషం చిమ్మిన చోటనే విజయం.. అమెరికాలో అదానీ కడిగిన ముత్యం..
X

అపోహలు, ఆరోపణలు తాత్కాలికమే కావచ్చు.. కానీ నిప్పులాంటి నిజం.. ఆత్మవిశ్వాసంతో కూడిన ధర్మం ఎప్పటికీ ఓడిపోవు.. కొన్నిసార్లు అంతర్జాతీయ వేదికలపై విమర్శల దాడి జరగొచ్చు.. ప్రతిష్టను మసకబార్చే కుట్రలు పడొచ్చు. కానీ కాలం గడిచేకొద్దీ న్యాయమే గెలుస్తుంది. గౌతమ్ అదానీ విషయంలో ఇప్పుడు జరిగింది ఇదే.. అమెరికా వేదికగా ఆయనపై.. అదానీ గ్రూప్ సత్యసంధతపై విసిరిన విషపు ఆరోపణలన్నీ మంచులా కరిగిపోయాయి. అపవాదులు చిమ్మిన చోటనే ఆయన కడిగిన ముత్యంలా.. అధిగమించిన విజేతగా నిలిచారు.

క్రిమినల్ కేసులకు శాశ్వత స్వస్తి..

అదానీ గ్రూప్‌ను, గౌతమ్ అదానీ వ్యక్తిత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీయాలని చూసిన హైప్రొఫైల్ క్రిమినల్ కేసును అమెరికా ఫెడరల్ కోర్టు డిస్మిస్ చేసింది. కేవలం కేసు కొట్టేయడమే కాదు.. ఇకపై మళ్లీ ఈ ఆరోపణలతో కేసు నమోదు చేయడానికి వీల్లేని విధంగా ‘ విత్ ప్రిజ్యూడిస్’ అని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.

ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో న్యాయమూర్తి నికోలస్ గరాఫిస్ వెలువరించిన ఈ చారిత్రాత్మక నిర్ణయంతో.. అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారంటూ నమోదైన సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణల కథ ముగిసింది. భారతదేశంలో సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చారంటూ అప్పట్లో మోపిన నిందలన్నీ పటాపంచలయ్యాయి. అమెరికా న్యాయశాఖ నిర్ణయానికి అనుగుణంగా కోర్టు ఇచ్చిన ఈ ముగింపు అదానీ గ్రూప్‌కి లభించిన అతిపెద్ద విజయంగా నిలిచింది.

సివిల్ సెటిల్‌మెంట్‌తో చెక్‌మేట్

మరోవైపు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తో వివాదాలకు కూడా సివిల్ సెటిల్‌మెంట్ రూపంలో ముగింపు పలికారు. గౌతమ్ అదానీ $6 మిలియన్లు, సాగర్ అదానీ $12 మిలియన్లు.. మొత్తంగా $18 మిలియన్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించారు. అయితే ఈ ప్రక్రియలో వారు ఎలాంటి ఆరోపణలను అంగీకరించకపోవడం లేదా తప్పు చేసినట్లు ఒప్పుకోకపోవడం గమనార్హం. అలాగే ఇరాన్ ఆంక్షల వ్యవహారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా $275 మిలియన్ల చెల్లింపుతో అమెరికా ట్రెజరీతో ఉన్న ప్రత్యేక విషయాన్ని కూడా సజావుగా పరిష్కరించుకున్నారు.

“న్యాయంపై మా నమ్మకం గెలిచింది”

“న్యాయవ్యవస్థపై, సత్యంపై మాకున్న నమ్మకం మరోసారి గెలిచింది. దేశ శ్రేయస్సు కోసం, భారత్ పురోగతి కోసం మేము పడే తపన, చేసే పనులు నిరంతరం కొనసాగుతాయి.. జై హింద్ ” అని

తీర్పు అనంతరం గౌతమ్ అదానీ వ్యక్తంచేసిన ఈ భావోద్వేగ స్పందన.. దేశం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటిచెబుతోంది.

తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్జాతీయ మీడియా చేసిన నానా రకాల ప్రచారాలు, పెట్టుబడిదారుల్లో తలెత్తిన అనుమానాలు.. వీటన్నింటినీ దాటుకుని.. క్లిష్ట సమయంలోనూ నిలబడి గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో అదానీ గ్రూప్ అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ సగర్వంగా అడుగులు వేయబోతోంది. నిందలు వేసిన వారే నోళ్లు మూసుకునేలా.. న్యాయం తన గళాన్ని వినిపించింది.