Begin typing your search above and press return to search.

మాజీ వ‌ర్సెస్ తాజా: 'గ‌న్న‌వ‌రం' రూటు మారుతోందా.. ?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.

By:  Garuda Media   |   1 Aug 2026 6:00 AM IST
మాజీ  వ‌ర్సెస్ తాజా: గ‌న్న‌వ‌రం రూటు మారుతోందా.. ?
X

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. తాజా ఎమ్మెల్యే.. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ మ‌ధ్య వివాదాలు ర‌చ్చ రేపు తున్నాయి. వాస్త‌వానికి వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టుగాఉ న్న నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని విమానాశ్ర‌యంలో కాంట్రాక్టు వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరువురు నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాల‌ను వేడెక్కించింది.

త‌న‌పై యార్ల‌గ‌డ్డ చేసిన విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిగా.. వంశీ ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ రాశా రు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలోని 20 శాతం ప‌నుల‌ను వేరే కాంట్రాక్టు సంస్థ‌కు అప్ప‌గించారు. అయితే.. ఈ విష‌యంలో క‌నీసం త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేకుండానే ప‌నిచేశార‌న్న‌ది యార్ల‌గ‌డ్డ చేస్తున్న ఆరో ప‌ణ‌. ఇదే స‌మ‌యంలో స‌ద‌రు కాంట్రాక్ట‌ర్‌కు వంశీకి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న క‌నుస‌న్న ల్లోనే.. కాంట్రాక్టును అప్ప‌గించార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

ఇది గ‌త కొన్నాళ్లుగా వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా వంశీ.. త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు. దీనిపై యార్ల‌గ‌డ్డ నిప్పులు చెరిగారు. లీగ‌ల్ నోటీసులు ఇచ్చినా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, అక్రమ మట్టి తవ్వకాలు చేయలేదని, చందాలు వసూలు చేసి రాజకీయాలు చేయలేదని ప‌రోక్షంగా వంశీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

గన్నవరాన్ని దోచుకుని, అభివృద్ధిని అడ్డుకున్నవారే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గన్నవరం నియోజకవర్గంతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఈ ఏడాది నవంబర్ 17 నాటికి రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతుందని యార్లగడ్డ తెలిపారు. నియోజకవర్గ రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధే తన రాజకీయ లక్ష్యమని యార్ల‌గ‌డ్డ‌ స్పష్టం చేశారు.

నిశితంగా గ‌మ‌నిస్తున్నారు..

మ‌రోవైపు గ‌న్న‌వ‌రం వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను పార్టీ అధిష్టానం నిశితం గా గ‌మ‌నిస్తోంది. ఇప్ప‌టికే వంశీ లేఖ రాయ‌డం.. యార్ల‌గ‌డ్డ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటివాటిని పార్టీ నాయ‌కులు గ‌మ‌నిస్తున్నార‌ని.. దీనిపై అధిష్టానం కూడా సీరియ‌స్‌గానే ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించేందుకు.. సీనియ‌ర్ల‌ను రంగంలోకి దింపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే గ‌న్న‌వ‌రం వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు స‌మీక్షించ‌నున్న‌ట్టు స‌మాచారం.