Begin typing your search above and press return to search.

స్వామి వ‌ర్సెస్ థామ‌స్‌.. రోడ్డున ప‌డ్డారే.. !

గంగాధర నెల్లూరు నియోజకవర్గ నుంచి గత ఎన్నికల్లో టిడిపి తరఫున థామస్ విజయం సాధించుకున్నారు.

By:  Garuda Media   |   16 Sept 2025 1:50 PM IST
స్వామి వ‌ర్సెస్ థామ‌స్‌.. రోడ్డున ప‌డ్డారే.. !
X

రాజకీయాల్లో ప్రత్యర్ధుల మధ్య మాటల యుద్ధం కామన్ గానే జరుగుతుంది. అది వైసిపి అయినా టిడిపి అయినా బిజెపి అయినా మరో పార్టీ అయినా ఏదైనా సరే సాధారణంగానే ప్రత్యర్థుల మధ్య నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే మాటలు యుద్ధం కామన్. సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అధికార, విపక్ష నాయకుల మధ్య చోటు చేసుకున్న వ్యవహారం రోడ్డున పడి పచ్చి బూతులు తిట్టుకునే వరకు సాగడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గ నుంచి గత ఎన్నికల్లో టిడిపి తరఫున థామస్ విజయం సాధించుకున్నారు. గడిచిన 15 నెలల కాలంలో ఎమ్మెల్యే థామస్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. కీలకమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనిని ఎవరు కాదనలేరు. అయితే, ఇదే సమయంలో ఆయన మాజీ మంత్రి ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడటం... ఆయనను అరెయ్‌ ఒరేయ్ అని అనటం తీవ్రస్థాయిలో దూషించటం వంటివి రాజకీయంగా తీవ్ర విమర్శలకు వివాదాలకు దారి తీసింది.

నియోజకవర్గంలో 2000 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఇసుక మద్యం కుంభకోణంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని నారాయణస్వామి ఇటీవల విమర్శించారు. అయితే దీనిని తీవ్రంగా భావించిన ఎమ్మెల్యే థామస్ ఎదురుదాడి ప్రారంభించారు. మాజీ మంత్రి నారాయణస్వామిని అరేయ్ ఒరేయ్‌ అంటూ తీవ్రంగా దూషించారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని, అక్రమాలు అన్యాయాలకు నారాయణస్వామి కేర్ ఆఫ్ గా మారారని విమర్శలు గుప్పించారు. దమ్ముంటే గంగాధర నెల్లూరు అడ్డాకు రావాలని గల్లా పట్టుకుని నిలదీస్తానని వ్యాఖ్యానించారు.

ఇది రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. సాధారణంగా నారాయణస్వామి వివాదానికి దూరంగా ఉంటారు. అదేవిధంగా థామస్ కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.. కొత్తగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన కూడా సౌమ్యడనే పేరు ఉంది. కానీ, చిన్నపాటి విమర్శలకే చిన్నపాటి వివాదాలకే ఈ స్థాయిలో రోడ్డును పడటం అనేది ఇద్దరు నాయకులకు మంచిది కాదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఏదైనా ఉంటే చర్చల ద్వారా మాటల ద్వారా విమర్శలు చేసుకోవచ్చు వ్యాఖ్యానించొచ్చు. తప్పులుంటే ఎత్తిచూపుకోవచ్చు. కానీ, ఇలా దూషణలు ప్రతి దూష‌ణ‌ల‌కు దిగడం వల్ల రాజకీయంగా ఇద్దరూ ప్రజల అభిమానాన్ని కోల్పోతారు అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.