గ్లోబల్ సమ్మిట్ లో గల్లాదే భారీ బోణీ
ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రంగంలోకి వచ్చాయి. అలాగే రానున్న కాలంలో పునరుత్పాదక ఇందనానికి డిమాండ్ పెరుగుతుంది.
By: Satya P | 9 Dec 2025 8:36 AM ISTటీడీపీకి చెందిన మాజీ ఎంపీ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ గ్లోబల్ సమ్మిట్ లో భారీ పెట్టుబడులు అనౌన్స్ చేశారు. ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆయన తెలంగాణాలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. గెగా ఫ్యాక్టరీ ని తొమ్మిది వేల కోట్ల భారీ పెట్టుబడులతో తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మూడు వందల ఎకరాలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రానున్న పదేళ్ల కాలంలో వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ గెగా ఫ్యాక్టరీ పనిచేస్తుందని గల్లా జయదేవ్ చెబుతున్నారు.
గ్రీన్ ఎనర్జీ కోసం :
ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రంగంలోకి వచ్చాయి. అలాగే రానున్న కాలంలో పునరుత్పాదక ఇందనానికి డిమాండ్ పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గల్లా జయదేవ్ ఈ గెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో అధిక పెట్టుబడులు పెట్టిన ఆయన అమర్ రాజా బ్యాటరీస్ తో ఎంతో పాపులర్ అయ్యారు. తన వ్యాపారాలను గత ఏడాదే తెలంగాణాలోనూ విస్తరించారు. ఇక గ్లోబల్ సమ్మిట్ కోసం భారీ పెట్టుబడులను ఆవ్హానిస్తూ తెలంగాణా ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీలలో మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది. తొలి రోజునే భారీ పెట్టుబడులతో గల్లా జయదేవ్ శుభారంభం పలకడం విశేషం.
రెండూ ముఖ్యమే అంటూ :
తెలంగాణా ఏపీ రెండూ తమకు కుడి ఎడమ చేతులుగా ఉంటాయని మీడియాతో ఈ సందర్భంగా జయదేవ్ పేర్కొన్నారు. విభజన ముందు ఆ తరువాత కూడా తాము ఏపీలోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ వచ్చామని ఆయన చెప్పారు. అయితే గత ఏడాది కాలంగానే తెలంగాణాలోనూ తమ బిజినెస్ ని విస్తరించేందుకు సిద్ధం అయ్యామని అన్నారు ఇక రాజకీయంగా చూస్తే బిజినెస్ పాలసీలు ఏ ప్రభుత్వం అయినా కంటిన్యూస్ గా కొనసాగించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఒక ప్రభుత్వానికి కాల పరిమితి కేవలం అయిదేళ్ళు మాత్రమే అని కానీ పారిశ్రామికవేత్తలకు పదినేను నుంచి ఇరవై ఏళ్ల లాంగ్ ప్లాన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పాలసీలను ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాలని పారిశ్రామికవేత్తలుగా తాము గట్టిగా కోరుకుంటామని అన్నారు. తెలంగాణాలో ఏ ప్రభుత్వం అయినా పలసీలు మారకపోవడం మంచి పరిణామమని గల్లా జయదేవ్ అనడం విశేషం.
రాజకీయాల్లోకి తిరిగి :
ఇక 2024 ఎన్నికల ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన గల్లా జయదేవ్ ఇపుడు మాత్రం పార్టీ అధినాయకత్వం ఎపుడు కోరినా తిరిగి రాజకీయంగా చురుకుగా ఉండేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆ విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయం అన్నారు. అంటే ఆయన మళ్ళీ రీ యాక్టివ్ కాదలచూన్నారు అన్నది స్పష్టం చేశారు అన్న మాట.
