Begin typing your search above and press return to search.

పొట్టలో నుంచి 'గ్యాస్' వదులుతూ గిన్నీస్ రికార్డ్.. వీడియో వైరల్!

ఇక తెగ హల్ చల్ చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు వారి వారి క్రియేటివిటీకి పని చెబుతూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

By:  Tupaki Political Desk   |   11 Oct 2025 1:06 PM IST
పొట్టలో నుంచి గ్యాస్ వదులుతూ గిన్నీస్  రికార్డ్.. వీడియో వైరల్!
X

ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాల రికార్డులు నెలకొల్పుతుంటారు.. మరికొంతమంది ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో గోళ్లు పెంచడం, నాలుక పొడవుగా చాపడం నుంచి ఎన్నో ఎన్నో రకాల ప్రయత్నాల్లో రికార్డులు సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాత్రం తన శరీరంలోని గ్యాస్ (అపానవాయువు)తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

అవును... మీరు చదివింది నిజమే! అపానవాయువును వైద్యులు సహజమైన జీర్ణ ప్రక్రియగా భావిస్తుంటారు. అది వదిలేవాళ్ల జీర్ణక్రియ సరిగ్గా ఉందని చెబుతుంటారు. అలా అని ఆ ప్రక్రియ అందరి ముందు చేయడం.. ఇటు చేసేవారికి, అటు పక్కనున్నవారికీ కూడా కాస్త ఇబ్బందినే కలిగిస్తుందని చెప్పొచ్చు! అయితే తాజాగా ఓ వ్యక్తి వీడియో కెమెరాలు, మైకుల ముందు ఈ పనికి పూనుకున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.. తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో భాగంగా... 40 సెకన్లపాటు ఏకధాటిగా ఆగకుండా అపానవాయువును మైక్ ముందు వదులుతున్నాడు. దానికి సంబంధించిన సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది! ఈ విషయంలో అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడని ప్రచారం జరుగుతుంది.

ఇక తెగ హల్ చల్ చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు వారి వారి క్రియేటివిటీకి పని చెబుతూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా... అతడి కడుపులో పెద్ద స్పేసే ఉందని ఒకరంటే... అతడు కడుపుకి అన్నం తింటునాడా.. లేక, గ్యాస్ పీలుస్తున్నాడా అంటూ మరొకరు స్పందించారు. ఇదే సమయంలో ఆ సీక్రెట్ ఏదో చెప్పు బ్రో, రోజూ టాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నామని ఇంకొకరు కామెంట్ పెట్టారు!

కాగా... ఈ విషయంలో నిజమైన ప్రపంచ రికార్డ్ హోల్డర్ బెర్నార్డ్ క్లెమెన్స్ అనే బ్రిటిష్ వ్యక్తి పేరున ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... మే 17, 2016న అతను 2 నిమిషాల 42 సెకన్ల పాటు ప్రపంచంలోనే అత్యంత పొడవైన అపానవాయువును విడుదల చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉన్నారు!

అదేవిధంగా.. క్లెమెన్స్ లాంటి అనేక ఆసక్తికరమైన, ఫన్నీ ప్రపంచ రికార్డులు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు... వాలెరీ స్మాగ్లి స్వంతం చేసుకున్న అతిపెద్ద కనురెప్పలు, రాధాకాంత్ బాజ్‌ పాయ్ స్వంతం చేసుకున్న పొడవైన చెవి వెంట్రుకలు, మెహ్మెట్ ఓజియురెక్ స్వంతం చేసుకున్న పొడవైన ముక్కు, గ్వాంగ్‌ జౌ డామింగ్ యునైటెడ్ రబ్బర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత సన్నని కండోమ్ మొదలైనవి.