Begin typing your search above and press return to search.

అప్పుడు యూట్యూబర్ ఇప్పుడు సర్పంచ్ మేడమ్

కొన్నిసార్లు రీల్ సీన్లు రియల్ సీన్లుగా మారుతుంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే.

By:  Garuda Media   |   29 Dec 2025 1:29 PM IST
అప్పుడు యూట్యూబర్ ఇప్పుడు సర్పంచ్ మేడమ్
X

కొన్నిసార్లు రీల్ సీన్లు రియల్ సీన్లుగా మారుతుంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. మొన్నటివరకు యూట్యూబర్ గా సుపరిచితమైన ఆమె.. ఇప్పుడు ఆ ఊరు ప్రథమ పౌరురాలిగా మారిన ఆసక్తికర ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రంగయ్యపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. యూట్యూబర్ రజితగా అందరికి తెలిసిన ఆమె ఇప్పుడు సర్పంచ్ మేడమ్ గా మారారు. యూట్యూబ్ వీడియోలతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించిన ఆమె అనూహ్య రీతిలో రాజకీయాల్లోకి రావటం.. సర్పంచ్ గా ఎన్నిక కావటం ఆసక్తికరంగా మారింది. ఆమె జర్నీలోకి వెళితే..

కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రజిత డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత టీటీసీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్నది ఆమె కోరిక. అయితే 2011లో ఆమెకు హనుకొండజిల్లా రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మహేశ్ తో వివాహమైంది. ఇద్దరు పిల్లలతో ఖాళీగా ఉంటున్న ఆమె సరదాగా స్నేహితురాలి సూచనతో 2018 నుంచి రీల్స్ చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ లో అవకాశాలు రావటంతో వాటిల్లో నటించటం షురూ చేశారు.

జబర్దస్త్.. భీమదేవరపల్లి బ్రాంచ్.. ఆర్సీ 15, కనబడుటలేదు సినిమాలతో పాటు దాదాపు నాలుగువేళకు పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఆమెకు ఇన్ స్టాలో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ సీరియళ్లతో పాటు.. ఓ చానల్ లో యాంకర్ గా అవకాశం వచ్చినా.. పిల్లలు చిన్నవాళ్లు కావటంతో ఆ అవకాశాల్ని వదులుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె భర్త మహేవ్ ఆరేళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి కొద్దిఓట్ల తేడాతో ఓడారు.

ఈ మధ్యనే ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో రంగయ్యపల్లి గ్రామాన్ని బీసీ మహిళకు రిజర్వు చేవారు. దీంతో భర్త సహకారంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటివరకు యూట్యూబర్ గా సుపరిచితమైన ఆమె సర్పంచ్ మేడమ్ గా అవతరించారు. తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె పొలిటికల్ ఇన్నింగ్స్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.