Begin typing your search above and press return to search.

యువతి 13 ఏళ్ల పాటు భయాందోళనలో!

సమాజంలో మహిళల రక్షణ ..సైకో స్టాకర్ల వల్ల ఎదురయ్యే ముప్పును కళ్లకు కట్టేలా అమెరికాలో ఓ భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

By:  Srikanth Kontham   |   13 Jun 2026 4:00 PM IST
యువతి 13 ఏళ్ల పాటు భయాందోళనలో!
X

సమాజంలో మహిళల రక్షణ ..సైకో స్టాకర్ల వల్ల ఎదురయ్యే ముప్పును కళ్లకు కట్టేలా అమెరికాలో ఓ భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మిచిగాన్‌కు చెందిన సమంతా స్టైట్స్ అనే యువతిని క్రిస్టోఫర్ బ్లెయిన్ థామస్ అనే వ్యక్తి ఏకంగా 13 ఏళ్ల పాటు నిరంతరం వెంబడించి వేధించాడు. ఈ సుదీర్ఘ వేధింపుల పర్వం చివరకు ఒక ఘోరమైన కిడ్నాప్‌గా మారిన ఉదందాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ ABC ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీ ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కథనం మూలాలు 2011 నాటి కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యాయి.

గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో సమంతా కంటే సీనియర్ అయిన క్రిస్టోఫర్ థామస్ ఒక స్టూడెంట్ గ్రూప్‌లో పరిచయమయ్యాడు. సాధారణ క్లాస్‌మేట్‌గా ఆమె మాట్లాడిన మాటలను అతను ఒక తీవ్రమైన పిచ్చిగా మార్చుకున్నాడు. సమంతా తనను ఒంటరిగా వదిలేయాలని చెప్పినా? అతను వందల కొద్దీ సందేశాలు పంపేవాడు. అటుపై స‌మంత ఆమె వెళ్లే రెస్టారెంట్లు, పని ప్రదేశాల వరకు నీడలా వెంబడించడం ప్రారంభించాడు. ఈ మానసిక వేధింపులు 2022 కి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నాయి.

ఒకరోజు తెల్లవారుజామున సమంతా నిద్రిస్తున్న సమయంలో క్రిస్టోఫర్ ఇంట్లోకి చొరబడి గొంతు నొక్కి బంధించాడు. ఆపై స‌మంత‌ కారులోనే ఆమెను అపహరించి నిర్మానుష్య ప్రాంతంలోని రెంటల్ స్టోరేజ్ యూనిట్‌కు తరలించాడు. అక్కడ అతను ముందే ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఒక సౌండ్‌ప్రూఫ్ రహస్య బంకర్‌లో ఆమెను బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఈ సౌండ్‌ప్రూఫ్ బంకర్ ఆలోచనను క్రిస్టోఫర్ ఒక నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ సిరీస్ `యు` నుండి స్ఫూర్తిగా తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఆ చీకటి గదిలో దాదాపు 14 గంటల పాటు ప్రాణభయంతో కొట్టుమిట్టాడిన సమంతా చివరకు అతనితో ఒప్పందం చేసుకుని ఎలాగోలా చాకచక్యంగా ఆ నరకం నుండి తప్పించుకోగలిగింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. అనంత‌రం క్రిస్టోఫర్ అరెస్ట్ అయ్యాడు. న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ అనంతరం 2024లో కోర్టు క్రిస్టోఫర్ థామస్‌ను నేరస్థుడిగా ప్ర‌క‌టించి 40 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతను మిచిగాన్‌లోని మస్కేగాన్ కరెక్షనల్ ఫెసిలిటీ హై-సెక్యూరిటీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

రికార్డుల ప్రకారం అతను 2062 కంటే ముందు జైలు నుండి విడుదలయ్యే అవకాశం లేదు. ఈ భయంకరమైన నరకం నుండి ప్రాణాలతో బయటపడిన సమంతా ప్రస్తుతం స్టాకింగ్ బాధితుల హక్కుల కోసం పోరాడుతూ సామాజిక కార్యక ర్తగా సేవలందిస్తోంది. ఆధునిక సమాజంలో సాంకేతికత , వినోద మాధ్యమాలను కొందరు నేరస్థులు ఎలా దుర్విని యోగం చేస్తున్నారో? చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. చట్టాలు ఉన్నా? ఒక మహిళను దశాబ్దానికి పైగా భయాందో ళనలకు గురిచేసి బంకర్‌లో బంధించే స్థాయికి వెళ్లడం వ్యవస్థలోని లోపాలను సూచిస్తుంది. ఇలాంటి క్రూరమైన మనస్తత్వాలు పెరగకుండా నిరోధించడానికి చట్టపరమైన కఠిన చర్యలతో పాటు తక్షణ రక్షణ వ్యవస్థలు ఎంతైనా అవసరం ఉంది.