దావోస్ స్పెషాలిటీ....ఈసారి కూడా సీఎంలు రెడీ
దావోస్ టూర్ ఈసారి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయబోతోంది. ప్రతీ ఏటా జనవరిలో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దేశంలోని సీఎంలు అంతా హాజరు అవుతూ ఉంటారు.
By: Satya P | 15 Dec 2025 6:00 AM ISTదావోస్ టూర్ ఈసారి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయబోతోంది. ప్రతీ ఏటా జనవరిలో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దేశంలోని సీఎంలు అంతా హాజరు అవుతూ ఉంటారు. అక్కడ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలు అంతా హాజరవుతారు. అంతా ఒకేచోట ఉన్న వేళ ఒప్పందాలకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాంతో ఏ ఏటికి ఆ ఏడు దావోస్ టూర్ కి విశేష ప్రాధాన్యత ఏర్పడుతోంది.
నలుగురు సీఎంలతో సహా :
ఈసారి దావోస్ టూర్ కి దేశంలోని నలుగురు ముఖ్యమంత్రులతో పాటు అనేక మంత్రి కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలలోని పరిశ్రమలు ఐటీ శాఖలను చూసే మంత్రులు హాజరవుతున్నారు. ఏపీ నుంచి చంద్రబాబు కచ్చితంగా హాజరవుతారని చెబుతున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ వెంకటేష్ ఈ టూర్ లో భాగ్మ్ కానున్నారు. తెలంగాణా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహా కీలక నేతలు హాజరవుతారని చెబుతున్నారు. అదే విధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫండ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దావోస్ టూర్ లో పాలు పంచుకుంటున్నారు.
కేంద్ర మంత్రులు సైతం :
ఇక దావోస్ పర్యటనకు పలువురు కేంద్ర మంత్రులు ఈసారి హాజరవుతున్నారు. అలాగే ముఖ్యమంత్రులు హాజరు కాని చోట పలు రాష్ట్రాల మంత్రులు సైతం దావోస్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అలా యూపీ నుంచి పెద్ద సంఖ్యలో మంత్రుల బృందం అటెండ్ అవుతోంది అని అంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా వస్తున్నారు.
దావోస్ షెడ్యూల్ ఇదే :
ఇక 2026 జనవరిలో 19వ తేదీ నుంచి 23 వరకూ నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ వార్షిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దాంతో 140 దేశాల నుంచి ఏకంగా మూడు వేల నుంచి మూడు వేల అయిదు వందల మంది దాన ప్రపంచ స్థాయి నేతలు, వ్యాపాద దిగ్గజాలు హాజరవుతున్నారు అలాగే సుమారు యాభైకి పైగా దేశాల నుంచి దేశాధినేతలు కూడా దావోస్ సదస్సులో పాలుపంచుకుంటున్నారు.
దావోస్ మీట్ అంటే :
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది ప్రభుత్వ-ప్రైవేట్ సహకారం కోసం ఏర్పాటు అయిన ఒక అంతర్జాతీయ సంస్థగా ఉంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ ఫోరం ప్రతీ ఏటా సమావేశం నిర్వహిస్తుంది జనవరి వచ్చిందంటే చాలు దావోస్ లో సందడే సందడిగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి ఒక అంతర్జాతీయ వేదికగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం తరఫున వ్యాపార రంగం తరఫున మేధావుల నుంచి కూడా నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇక దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక ముఖ్య అంశాలు చూస్తే కనుక ఐదు రోజుల పాటు అనేక సెషన్‌లలో ప్రపంచ సవాళ్లపైన వర్తమాన పరిస్థితుల మీద లోతైన చర్చలు ఉంటాయి.
మంచి వేదికగా :
అంతర్జాతీయంగా వర్తమాన సమస్యలను పరిష్కరించడమే కాకుండా మరింత మెరుగైన సమాజం కోసం ఈ సదస్సులో చర్చించాలని ఈ సమావేశం ఉద్దేశించబడింది. ప్రతీ ఏటా ఒక థీంని పెట్టుకుని ఈ మీట్ సాగుతుంది. 2026 లో దావోస్ లో జరిగే సమావేశంలో సంభాషణ స్ఫూర్తి, సహకారం, అభివృద్ధి, ప్రజల కోసం అధికంగా పెట్టుబడి పెట్టడం, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు, గ్రహ సరిహద్దులలో సైతం శ్రేయస్సు అనే ఐదు ముఖ్యమైన ప్రపంచ సవాళ్లపై చర్చిస్తూ ఈ సదస్సు దృష్టి పెడుతుందని చెబుతున్నారు.
