భారత్ కు తిరిగి వచ్చేస్తున్న ఫోర్డ్.. ఈసారి వ్యూహమిదే
గతంలో ఈ ప్లాంట్ నుంచి ఎకో స్పోర్ట్.. ఎండీవర్.. ఫిగో.. ఆస్పైర్.. ఫ్రీస్టైల్ లాంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన ఫ్లాంట్ నుంచి తాజాగా భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
By: Garuda Media | 1 Nov 2025 1:00 PM ISTప్రపంచ వాహన దిగ్గజ సంస్థల్లో ఒకటి అమెరికాకు చెందిన ఫోర్డు. నాలుగేళ్ల క్రితం భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టేసిన ఈ సంస్థ.. అమెరికాకు వెళ్లిపోయింది. కాస్త విరామం తర్వాత మళ్లీ భారత్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే..ఈసారి భిన్నమైన వ్యాపార వ్యూహంతో వచ్చింది. అమెరికాకు చెందిన ఫోర్డ్.. 2021లో భారత్ లో తన కార్ల ఉత్పత్తిని ఆపేసింది.
ఈ సంస్థకు తమిళనాడులోని మరైమలై నగర్ లో భారీ ఫ్లాంట్ ఉంది. నాలుగేళ్లుగా ఎలాంటి కార్యకలాపాల్ని చేపట్టలేదు. అయితే.. తాజాగా భారత్ కు తిరిగి వచ్చిన ఈ సంస్థ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజాగా ఈ సంస్థ రూ.3250 కోట్ల పెట్టుబడులతో వస్తోంది. ఇందుకోసం తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంతో కొత్త అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
గతంలో ఈ ప్లాంట్ నుంచి ఎకో స్పోర్ట్.. ఎండీవర్.. ఫిగో.. ఆస్పైర్.. ఫ్రీస్టైల్ లాంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన ఫ్లాంట్ నుంచి తాజాగా భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి ఈ ఫ్లాంట్ ను సిద్ధం చేయనున్నారు. 2029 నుంచి ఈ ఫ్లాంట్ లో కార్ల ఇంజిన్ ను ఉత్పత్తి చేస్తారు.
ఏడాదికి 2.35 లక్షల కొత్త ఇంజిన్లను తయారు చేసి.. వాటిని విదేశాలకు ఎగుమతి చేయాలన్నది ఫోర్డ్ ఆలోచన. తాజాగా తిరిగి వచ్చేసిన ఫోర్డ్ కారణంగా ప్రత్యక్షంగా 600 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు.. అంతకు ఎక్కువగా పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఏమైనా.. నాలుగేళ్లు తమిళనాడు ఫ్లాంట్ ను ఖాళీగా ఉంచిన సంస్థ.. ఇప్పుడు తిరిగి వచ్చేసి ఉత్పత్తి చేపట్టటం సానుకూలాంశంగా చెప్పక తప్పదు.
