Begin typing your search above and press return to search.

ప్రార్థనలు, కేకలు… గాల్లో నాలుగు గంటల భయానక ప్రయాణం..

ఓ మహిళ చేతులు జోడించి ప్రార్థిస్తూ మొదట నిశ్శబ్దంగా ప్రార్ధన చేస్తూ కనిపించింది. కొద్ది క్షణాల్లోనే ఆమె భయం పెరిగి కళ్లలో నీళ్లు ధారపోస్తూ శరీరం వణుకుతూ దేవుణ్ణి ప్రార్థించింది.

By:  A.N.Kumar   |   20 April 2026 10:55 PM IST
ప్రార్థనలు, కేకలు…  గాల్లో నాలుగు గంటల భయానక ప్రయాణం..
X

ఆకాశంలో ప్రయాణం సాధారణంగా సురక్షితంగా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఆ ప్రశాంతతను భయానక అనుభవంగా మార్చేస్తాయి. అలాంటి ఘటననే తాజాగా ఫ్లై 91 కు చెందిన ఒక విమానంలో చోటుచేసుకుంది.

ఓ మహిళ చేతులు జోడించి ప్రార్థిస్తూ మొదట నిశ్శబ్దంగా ప్రార్ధన చేస్తూ కనిపించింది. కొద్ది క్షణాల్లోనే ఆమె భయం పెరిగి కళ్లలో నీళ్లు ధారపోస్తూ శరీరం వణుకుతూ దేవుణ్ణి ప్రార్థించింది. ఆమె తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆ ఫ్లైట్‌లో జరిగిన భయానక పరిస్థితులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

సమాచారం ప్రకారం ఫ్లై91 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మిక సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం నియంత్రణ కోల్పోయినట్లు అనిపించి ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితి ఒకటి రెండు నిమిషాలు కాదు… దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది.

విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. కొందరు దేవుడిని ప్రార్థించగా, మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులకు చివరి సందేశాలు పంపినట్లు సమాచారం. విమానంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పైలట్లు , సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ నాలుగు గంటల అనుభవం ప్రయాణికుల మదిలో భయాన్ని మిగిల్చింది.

ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందిస్తూ సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, కానీ ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు వెల్లడించింది.

ఈ సంఘటన మరోసారి విమాన ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. గాల్లో కేవలం కొన్ని నిమిషాల భయం కూడా ఎంత తీవ్రంగా ఉండగలదో ఈ నాలుగు గంటల భయానక అనుభవం స్పష్టంగా చూపించింది.