మొదటి రాత్రి వింత అనుభవం.. కత్తితో వచ్చిన వధువు.. కారణం ఇదే..
ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించే ఘటన. కానీ సినిమాలో కాదు.. నిజ జీవితంలో చోటుచేసుకున్నదే.
By: Tupaki Political Desk | 20 Nov 2025 3:00 PM ISTఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించే ఘటన. కానీ సినిమాలో కాదు.. నిజ జీవితంలో చోటుచేసుకున్నదే. ఫస్ట్ నైట్ కు వధువు చేతిలో కత్తి.. వరుడికి ‘నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా’ అనే వార్నింగ్.. ఇలాంటి కథలు సాధారణంగా సినిమా సిండ్రోమ్‌లోనే వింటాం. కానీ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పెళ్లి జరిగిన ఫస్ట్ నైట్ రోజే భయంకరంగా మలుపు తిరిగింది. పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ అనేది ఏ జంటకైనా కొత్త కోరికలు తీర్చుకునే వేళ. కానీ ఈ వరుడికి ఆ రాత్రే జీవితంలో ఆందోళనను కలిగించేదిగా మారింది. ఇంట్లోని స్పెషల్ రూమ్, అలంకరించిన మంచం, కొత్త ఆశలు అన్నీ రెడీ. పాల గ్లాస్ తో రావాల్సిన వధువు మాత్రం కత్తి పట్టుకొని నిలబడింది. ‘నన్ను తాకితే నిన్ను 35 ముక్కలు చేస్తా.. నేను ఇంకొకరి వాడిని’ అని వధువు చెప్పిన మాట వరుడిని షాక్ కు గురి చేసింది.
ముట్టుకుంటే నరుకుతా..
ఆ రాత్రి.. తర్వాత మూడు రాత్రులు.. వరుడు గదిలోనే భయంతో గడిపాడు. బయటికి చెప్పలేడు. లోపలి ఉన్న భయం.. తన జీవిత భవిష్యత్తు కత్తి అంచుపై వేలాడుతున్నట్టే అనిపించింది. మూడు రోజుల తర్వాత ఇంటి పెద్దలకు చెప్పాడు.. చివరకు ధైర్యం చేసి వరుడు తల్లికి విషయం చెప్పాడు. వెంటనే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. వాదనలు, కోపాలు మధ్య వధువు చివరకు నోరు తెరిచింది.
నాకు అమన్ అంటే ఇష్టం..
‘నాకు అమాన్ అంటే ప్రేమ. నన్ను అతని దగ్గరకు పంపండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు..’ ఇలా వధువు బహిరంగంగానే మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు చెప్పడంతో, ఇరు కుటుంబాల వారు షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో అర్ధం కాక కంగారు పడ్డాయి. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పెద్దలు కలసి ఒక చిన్న మీటింగ్ పెట్టారు. కానీ నిర్ణయం తీసుకునేలోపు.. రాత్రి సమయంలో వధువు ఇంటి వెనుక గోడ దూకి అత్తరింటి నుంచి పారిపోయింది. అది కూడా ఆమె ప్రేమిస్తున్న అబ్బాయి అమాన్‌తో కలిసి. ఇలా పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లి ముగిసేలోపే ఇంటి గోడ దాటి పరారైంది. ఉదయం చూస్తే వధువు కనిపించకపోవడంతో, కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కేసు విచారణలో ఉంది.
నైనీ ఏరియా మొత్తం ఈ కథే మాట్లాడుతోంది
ఈ ఘటన జరిగిన వెంటనే, ఏడీఏ కాలనీ నైనీ ప్రాంతం అంతా ఒకే కథ వినిపిస్తోంది. ‘ఏంటి ఇది? పెళ్లి చేసి అత్తారింటికి పంపితే కత్తితో బెదిరిస్తూ, చివరికి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పారిపోవడం?’ ఏంటని గుసగుసలు పెడుతున్నారు. వధువు ప్రవర్తన, వరుడి పరిస్థితి, ఇంట్లో జరిగిన కలహాలు, చివరికి ఆమె పరార్ ఈ మొత్తం ఘటన అక్కడి ప్రజలని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ఈ కేసు కేవలం ఒక కుటుంబానికి చెందినది మాత్రమే.. కానీ పెళ్లిలాంటి పవిత్ర బంధంను కూడా ఇంత హేళన చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వివాహానికి ముందే తను ప్రేమలో ఉన్నట్లు చెప్పని యువతులు, వివాహం తర్వాత చెప్పి రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు పెంచుతున్నారు. ప్రేమ–బాధ్యత–నైతికతలు ఎలా ఎదురు దెబ్బతింటాయో చూపించే ఉదాహరణ. వరుడు ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నాడు. వధువు మాత్రం ప్రేమించిన వాడితో పారిపోయి కొత్త జీవితం చూసుకుంది.
