8 ఏళ్ల తర్వాత నిందితుడు కోసం గాలింపు.. పట్టిస్తే 45 లక్షల రివార్డ్!
2017లో ఒక భారతీయ మహిళ, ఆమె కుమారుడిని హత్య చేసిన కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న వ్యక్తి గురించి సమాచారం ఇచ్చిన వారికి 45లక్షల వరకు రివార్డును ఇస్తామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పుకొస్తుంది.
By: Madhu Reddy | 3 Dec 2025 1:45 PM IST2017లో ఒక భారతీయ మహిళ, ఆమె కుమారుడిని హత్య చేసిన కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న వ్యక్తి గురించి సమాచారం ఇచ్చిన వారికి 45లక్షల వరకు రివార్డును ఇస్తామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పుకొస్తుంది. విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన శశికళ నర్రా ఆమె కుమారుడు అనీష్ నర్రాను హత్య చేసిన కేసులో 38 ఏళ్ల నజీర్ హమీద్ పై ఆరోపణలు మోపబడ్డాయి. 2017 మార్చి, న్యూ జెర్సీలో జరిగిన ఈ హత్యకు సంబంధించి దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హమీద్ పై రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసులు పెట్టారు.
అయితే హత్య జరిగిన ఆరు నెలల్లో హంతకుడు భారత్ కి పారిపోయినట్టు కొంతమంది అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా భారత్ లోనే ఉన్నాడని కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే హత్యలపై దర్యాప్తు కొనసాగుతుండగానే బాధితురాలు భర్త హనుమంతరావు నర్రా ను కూడా అనుమానించారు. మరోవైపు హమీద్ అరెస్ట్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. హమీద్ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఎస్బిఐ యూఎస్డి 50వేల డాలర్ల వరకు రివార్డును అందిస్తామని ప్రకటించింది.
అంతేకాదు హమీద్ గురించిన సమాచారం ఎస్బిఐ యొక్క మోస్ట్ వాంటెడ్ వెబ్సైట్లో కూడా పెట్టింది.ప్రస్తుతం హత్యలకు గల కారణం పూర్తిగా తెలియదని, ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం హామీద్ ను తిరిగి అమెరికాకి తీసుకురావడమేనని అమెరికా అధికారులు చెబుతున్నారు. అలాగే హమీద్ ను అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని సహాయం కూడా కోరారు. ఈ దారుణమైన నేరం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెబుతూ భారత చట్టం, మా ద్వైపాక్షిక ఒప్పందం యొక్క నిబంధనలకు అనుగుణంగా అప్పగింత ప్రక్రియ సులభతరం చేయడానికి న్యూ జెర్సీ విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అలాగే న్యాయశాఖ, విదేశాంగ శాఖ మరియు ఎఫ్ బి ఐ లతో పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉండమని తెలిపారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి చెందిన నర్రా హనుమంతరావు తన భార్య శశికళ, కుమారుడు అనీష్ తో కలిసి న్యూ జెర్సీ లో నివాసం ఉండేవారు. అలా 2017 మార్చి 23న హనుమంతరావు పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి భార్య ,కొడుకు ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూశాడు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నర్రా శశికళ తరఫు బంధువులు మాత్రం భర్త హనుమంత రావే శశికళ ను, అనీష్ ని చంపేశాడని ఆరోపిస్తున్నారు.
అంతేకాదు హనుమంతరావుకి ఓ కేరళ మహిళతో ఉన్న అక్రమ సంబంధం వల్లే భార్యని, కొడుకుని చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందని తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయగా ఇందులో హనుమంతరావు ప్రమేయం ఏమీ లేదని తెలియడంతో ఆయన్ని వదిలేశారు. అంతేకాదు ఈ విచారణలో హనుమంతరావుకి.. తన సహోద్యోగి అయినటువంటి హమీద్ తో గొడవలు ఉండడం వల్ల హమీద్ హనుమంతరావు భార్య, కొడుకుని చంపేశాడని పోలీసులు తెల్చేశారు. అంతేకాదు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే హమీద్ భారత్ పారిపోగా.. ఆయన లాప్టాప్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన లాప్టాప్ నుండి సేకరించిన డిఎన్ఏ ఆధారంగా హత్య జరిగిన ప్రాంతంలోని డిఎన్ఏ తో మ్యాచ్ చేసి చూడగా అది సరిపోలడంతో ఈ హత్య చేసింది హమీదేనని పోలీసులు తేల్చేశారు. దాంతో అమెరికా పోలీసులు హమీద్ ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహాయం కూడా తీసుకుంటున్నారు మొత్తానికైతే హమీద్ ను పట్టించిన వారికి 45 లక్షల వరకు రివార్డు ఇస్తామని ప్రకటించారు.
