Begin typing your search above and press return to search.

యూట్యూబ్ 'గురువు'.. జైలు 'ఇల్లు'.. నకిలీ నోట్ల ముద్రణలో మొగుడూ పెళ్లాల 'క్రియేటివిటీ'

సాధారణంగా దంపతులు యూట్యూబ్‌లో ఏం చూస్తారు? కొత్త వంటలవండడం ఎలాగో చూస్తారు.. లేదంటే ఏదైనా టూర్ ప్లేసెస్ గురించి వెతుకుతారు.

By:  A.N.Kumar   |   17 Jun 2026 4:20 PM IST
యూట్యూబ్ గురువు.. జైలు ఇల్లు.. నకిలీ నోట్ల ముద్రణలో మొగుడూ పెళ్లాల క్రియేటివిటీ
X

సాధారణంగా దంపతులు యూట్యూబ్‌లో ఏం చూస్తారు? కొత్త వంటలవండడం ఎలాగో చూస్తారు.. లేదంటే ఏదైనా టూర్ ప్లేసెస్ గురించి వెతుకుతారు. కానీ మన తెలంగాణకు చెందిన ఓ జంట మాత్రం "రూట్ మార్చారు". "వంటలు చేస్తే కడుపు నిండుతుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు కదా" అని డిసైడ్ అయ్యారు. అంతే.. యూట్యూబ్‌ ఓపెన్ చేసి "హౌ టు బికమ్ బిలియనీర్ ఇన్ వన్ డే" అని కాకుండా "హౌ టు ప్రింట్ ₹500 నోట్స్ ఎట్ హోమ్" అని సెర్చ్ కొట్టారు. ఇంకేముంది.. ఐడియా అదిరిపోయింది, కానీ ప్లానింగే అడ్డం తిరిగింది!

హోమ్ మేడ్ బిజినెస్.. ఇంట్లోనే 'కలర్ ఫుల్' ముద్రణ

త్వరగా కోటీశ్వరులు అయిపోవాలనే కక్కుర్తి ఈ జంటను రాత్రికి రాత్రే 'నోట్ల ముద్రణాధికారులు'గా మార్చేసింది. ఒక స్కానర్, ఒక హై-క్వాలిటీ కలర్ ప్రింటర్, కొద్దిగా బాండ్ పేపర్. బ్రాండ్ న్యూ ₹500 నకిలీ నోట్లు ముదించేశారు. పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్తే దొరికిపోతాం అనుకున్నారో ఏమో.. చిన్న చిన్న కిరాణా కొట్లు, కూరగాయల మార్కెట్లను టార్గెట్ చేశారు. వీళ్ళు ప్రింట్ చేసిన నోట్లలో గాంధీ తాత బొమ్మ నవ్విందో లేదో తెలీదు కానీ వీరి తెలివితేటలు చూసి స్థానిక వ్యాపారులకు మాత్రం ముచ్చెమటలు పట్టాయి.

వ్యాపారుల 'కన్ను'.. పోలీసుల 'ఎంట్రీ'

పాపం ఈ జంట తాము చాలా స్మార్ట్ అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కిరాణా కొట్టు చిచ్చాలు కూడా నోటును నలిపి చూసి గానీ నమ్మట్లేదు. కొంతమంది వ్యాపారులకు వీరు ఇచ్చిన ₹500 నోట్ల మీద డౌట్ వచ్చింది. పేపర్ క్వాలిటీ చూసి, "ఇదేదో తేడాగా ఉందే..!" అని గమనించి సైలెంట్‌గా పోలీసులకు ఫోన్ కొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి సీక్రెట్‌గా వాచ్ పెట్టారు. దంపతుల కదలికలు గమనించి, పక్కా స్కెచ్‌తో వాళ్ల ఇంటిపై దాడి చేశారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల కళ్ళు బైర్లు గమ్మాయి. అక్కడ ఒక మినీ 'రిజర్వ్ బ్యాంక్' నడుస్తోంది మరి.

ఖాకీల క్లాస్.. "యూట్యూబ్ చూసి అన్నీ ట్రై చేయకండి బాబోయ్

ప్రస్తుతం ఈ దంపతులు కటకటాల వెనుక ఉండి "ఏ ఏ ఛానల్ చూసి ఈ విద్య నేర్చుకున్నారో" పోలీసులకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ఈ నోట్లను ఇంకా ఎక్కడెక్కడ చలామణి చేశారు? వీరి వెనుక ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల పబ్లిక్ నోటీస్

"దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండండి. చేతికి నోటు వస్తే ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అలాగే.. యూట్యూబ్‌లో వంటలు, రీల్స్ చూసి ఆనందించండి అంతే కానీ ఇలాంటి 'నోట్ల ముద్రణ' ప్రయోగాలు చేసి హోమ్ టూర్ కాస్తా.. జైలు టూర్ చేసుకోకండి " అని హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ కోసం దంపతులు వేసిన ప్లాన్ సూపర్ హిట్టే.. కాకపోతే థియేటర్ లో కాదు.. పోలీస్ స్టేషన్ లో..