Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... మోడీ రాజకీయ జీవితాన్ని ట్రంప్ ముగిస్తారా..!

తనదైన శైలి వ్యాఖ్యలతో నిత్యం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

By:  Raja Ch   |   9 Feb 2026 11:04 AM IST
వైరల్  ఇష్యూ... మోడీ రాజకీయ జీవితాన్ని ట్రంప్  ముగిస్తారా..!
X

తనదైన శైలి వ్యాఖ్యలతో నిత్యం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో తనది కాని క్రెడిట్ ను సైతం తన ఖాతాలో వేసుకునే పనికీ పూనుకుంటారనే విషయం భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడు (మరోసారి) వెళ్లడైంది! ఈ క్రమంలో... "నరేంద్ర మోడీ రాజకీయ జీవితానికి ముగింపు పలికే శక్తి నాకు ఉంది.. కానీ, నేను అలా చేయాలనుకోవడం లేదు" అని ట్రంప్ అన్నారనే ప్రచారం సోషల్ మీడ్యాలో ఊపందుకుంది!

అవును... అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బ్యాచ్ కు సోషల్ మీడియాలో కొదవే లేదని అంటారు. ఈ క్రమంలో తాజాగా... నరేంద్ర మోడీ రాజకీయ జీవితానికి ముగింపు పలికే శక్తి తనకు ఉందని.. కాని, తాను అలా చేయాలనుకోవడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. అయితే.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సరిగ్గా పరిశీలిస్తే.. ఇందులో తొలివాక్యం లేదు! ఆ శక్తి తనకు ఉందని ట్రంప్ చెప్పినట్లు ఆ వీడియోలో కనిపించలేదు! కాకపోతే అలా చేయాలనుకోవడం లేదని మాత్రమే అన్నారు!

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత... ఓ సందర్భంలో భారత్ - అమెరికా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్ నుంచి భారత ప్రధాని మోడీకి సంబంధించిన తీవ్రమైన రాజకీయ హెచ్చరికను సూచిస్తూ ఓ క్లిప్ వైరల్ అవుతుంది. దానికి పెట్టిన క్యాప్షన్... "నరేంద్ర మోడీ రాజకీయ జీవితానికి ముగింపు పలికే శక్తి నాకు ఉంది.. కానీ, నేను అలా చేయాలనుకోవడం లేదు" అని!

దీంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్లిప్.. రాజకీయ వ్యాఖ్యల్లో పదాల మధ్య గ్యాప్ లో చొప్పించే ఊహాగానాలకు సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు! ఈ క్రమంలో ఈ స్టేట్ మెంట్ ఇద్దరి నాయకుల మధ్య ఉద్రిక్తతను సూచిస్తుందా అనే చర్చా బలంగా తెరపైకి తెచ్చింది. ఇక... నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయగలనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారని, అగ్రరాజ్య ఆధిపత్యాన్ని చూపిస్తూ బెదిరించారని ఆరోపణలు వినిపించాయి!

సరిగ్గా గమనిస్తే... 2025 అక్టోబర్ నాటిదైన ఈ క్లిప్ లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు... "మోడీ గొప్ప వ్యక్తి.. ఆయనకు ట్రంప్ అంటే చాలా ఇష్టం.. ప్రేమ అనే పదాన్ని మీరు మరో విధంగా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను.. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు" అని అన్నారు. కట్ చేస్తే.. ఈ వ్యాఖ్యలకు అనువాదం కాస్తా భావానువాదం లోకి వెళ్లి.. ఈ ప్రచారం ఊపందుకుంది! ఇది అసలు విషయం!!