Begin typing your search above and press return to search.

మండించే మార్చ్... రెడీ అయిపోవాల్సిందే బాస్ !

ఇక ఈసారి చూస్తే మకర సంక్రాంతి పోతూనే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా మారుతున్నాయి. ఎండలు రానున్న రోజులలో గట్టిగా ఉంటాయని చెప్పడానికే ఈ సంకేతాలు అని అంటున్నారు.

By:  Satya P   |   24 Jan 2026 3:00 PM IST
మండించే మార్చ్... రెడీ అయిపోవాల్సిందే బాస్ !
X

ప్రకృతి వికృతిగా మారుతోంది. సీజన్లు గతులు తప్పుతున్నాయి. వానాకాలంలో ఎండలు ధాటీగా కాస్తాయి. చలికాలంలో వానలు బీభత్సంగా పడుతున్నాయి. ఇక ఏ సీజన్ అయినా అన్నీ తీవ్రంగానే ఉంటున్నాయి. ఎండలు అంటే భూమి బద్ధలు అయిపోయేటంతగా మాడ్చి మసి చెస్తున్నాయి. పోనీ వానలు కురుస్తాయి అనుకుంటే ఎక్కడా చూసుకున్నా మేఘాలు గూడుకట్టుకుని ఒక్కసారిగా విచ్చినమై క్లౌడ్ బరస్ట్ తో ఒకే చోట కుండపోత మాదిరిగా నీటిని పై నుంచి కురిపించేస్తున్నాయి. ఏకంగా గంటలో ఇరవై సెంటీమీటర్ల వర్షం పడుతూంటే ఊరికి ఊరే సెలయేరు అయిపోతోంది. చలికాలం తీసుకుంటే ఎముకలు కొరికే చలి మైదాన ప్రాంతాలలో ఉండడమే విశేషం. ఎన్నడూ లేని విధంగా సింగిల్ డిగ్రీలతో మంచు ముద్దగా చేసి పారేస్తోంది.

మారిన వాతావరణం :

ఇక ఈసారి చూస్తే మకర సంక్రాంతి పోతూనే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా మారుతున్నాయి. ఎండలు రానున్న రోజులలో గట్టిగా ఉంటాయని చెప్పడానికే ఈ సంకేతాలు అని అంటున్నారు. ఇక భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అంచనాలు చూసినా ఈసారి వేసవి ఎండలు పూర్తిగా మాడ కొడతాయని హెచ్చరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవి కాలం మండించేస్తుంది అని అంటున్నారు. ఈ ఎండలు తమ ప్రతాపాన్ని ఏకంగా మార్చి నెల నుంచే చూపిస్తాయని కూడా చెబుతున్నారు. నిజానికి మే నెల మధ్యలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గతంలో జరిగేది, ఇపుడు ఏప్రిల్ లోనే ఆ పరిస్థితి ఉంది. ఇక ఈ ఏడాది ఇంకాస్తా ముందుకు జరిగి మార్చి నుంచే నలభై డిగ్రీలు ఉంటే మేలో సీన్ ఏంటి అన్నది ఎవరికి వారే ఊహించుకోవాల్సిందే అని అంటున్నారు.

మండి పోవడమేనా :

ఈసారి అధిక ఉష్ణోగ్రతలు అని వాతావరణ శాఖ చెబుతున్న అంచనాలను చూస్తే కనుక మండి పోవడమేనా అన్న కలవరం అయితే అందరిలో ఇప్పటి నుంచే పట్టుకుంది. వెనక్కి వెళ్తే 2025లో భారీ తుఫాన్లు ఎన్నో వచ్చాయి. వానలు కూడా పెద్ద ఎత్తున కురిసాయి. కానీ ఈసారి అలాంటి ఉపశమనం ఉంటుందా అంటే కొంత తక్కువే అని అంటున్నారు. అంటే వేడితో జనాలు విలవిల్లాడాల్సిందే అని ఫిక్స్ అయిపోవాల్సిందే అని అంటున్నారు.

తగ్గిన చలి :

ఇక జనవరి మూడో వారంలోకి ప్రవేశించాక రెండు తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రంగా బాగా తగ్గిపోయింది. పగలే ఎండలు గట్టిగానే ఉంటున్నాయి. గత నెలతో పోలిస్తే ఒక్కసారిగా మూడు నాలుగు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని అంటున్నారు. దాంతో ఉక్క బోత తెలియకుండానే మొదలవుతోంది. మైదాన ప్రాంతాలలో అంతటా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఏజెనీలో మాత్రమే ఇంకా పగటి ఉష్ణోగ్రతలలో కొంత తక్కువ కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ఒక్కో డెగ్రీ పెంచుకుంటూ అధికమవుతున్న ఈ ఎండలు మార్చితోనే పీక్స్ కి చేరితే జనాల పరిస్థితి ఏంటి అంటే రెడీ అయిపోవడమే అన్న మాట వినిపిస్తోంది. ఈసారి అత్యధిక శాతం విద్యుత్ వినియోగం కూడా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రకృతి తన ప్రభావాన్ని చూపిస్తోంది. దానికి తగినట్లుగా సిద్ధపడడమే అని అంటున్నారు.