Begin typing your search above and press return to search.

EV కార్ల బ్యాటరీలపై అపోహలు.. అసలు నిజాలు ఇవే.!

అయితే నిజంగానే EV కార్ల బ్యాటరీలు తొందరగా పాడవుతాయా..? ఇందులో ఉన్న అసలు నిజాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

By:  Madhu Reddy   |   22 Aug 2025 3:21 PM IST
EV కార్ల బ్యాటరీలపై అపోహలు.. అసలు నిజాలు ఇవే.!
X

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో వేగంగా ముందుకు వెళుతోంది. టెక్నాలజీ సహాయంతో రోజురోజుకీ మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని.. చాలా మంది బ్యాటరీలతో నడిచే వాహనాలను తీసుకువస్తున్నారు. అలా ఇప్పటికే మార్కెట్లోకి బ్యాటరీలతో నడిచే కార్లు, మోటార్ బైక్ లు ఇలా ఎన్నో వచ్చాయి. అయితే బ్యాటరీలతో నడిచే కార్లు, మోటార్ బైకులు మార్కెట్లోకి కొత్త కొత్త రకాలు ఎన్నో వస్తున్నప్పటికీ ప్రజల్లో ఒక అపోహ మాత్రం ఉండిపోయింది. అదేంటంటే EV కార్లను తీసుకుంటే బ్యాటరీలు తొందరగా పాడవుతాయని.అయితే నిజంగానే EV కార్ల బ్యాటరీలు తొందరగా పాడవుతాయా..? ఇందులో ఉన్న అసలు నిజాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఎంతో మందిలో అనుమానాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే కొన్ని రోజులకే బ్యాటరీలు పాడవుతాయని,మళ్లీ ఆ బ్యాటరీలు కొత్తవి వేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కొంటే అది కొద్ది సంవత్సరాలలోనే బ్యాటరీ డెడ్ అవుతుందనేది పూర్తిగా అవాస్తవం. అలాగే కొత్తదాన్ని రీప్లేస్ చేయడానికి లక్షల ఖర్చు అవుతుందని,ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ముందుగానే ఆసక్తి చూపించడం లేదు చాలామంది. కానీ ఈ అపోహలు చెదిరిపోయేలా తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

2025 Deloitte అధ్యయనం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీలు ఎన్ని రోజులు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ కార్ ను కొనడానికి దాదాపు రూ.11 లక్షల ఖర్చు వస్తే.. దాన్ని కొన్న కొద్ది సంవత్సరాలకే EV బ్యాటరీలు పాడవుతే వాటిని మార్చడానికి రూ.3 నుండి రూ.8 లక్షలు అవుతాయి.అయితే రూ.11 లక్షలు పెట్టి కొన్న కారుకి రూ.3 నుండి రూ.8 లక్షలు పెట్టి బ్యాటరీలు వేయించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ అపోహ పెట్టుకొని EV కారును కొనుక్కోకపోవడం నిజంగా పొరపాటే అంటున్నారు కంపెనీలు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో కంపెనీ ద్వారా వచ్చే బ్యాటరీ చాలా సంవత్సరాలు మన్నికగా పనిచేస్తుందని Deloitte అధ్యయనం తేల్చి చెప్పింది.అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలు మనం కొనుగోలు చేసిన 5-7 సంవత్సరాల్లోనే డెడ్ అవుతాయనేది ఒక అపోహ మాత్రమేనని. వాస్తవం ఏంటంటే.. ఇప్పుడున్న ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు 10- 20 సంవత్సరాల వరకు చాలా సులభంగా పనిచేస్తాయి అంటూ తేల్చి చెప్పారు.. అంతేకాదు చాలా కంపెనీలు వాటికి వారంటీలు కూడా ఇస్తున్నాయి. ఓలా మోటార్స్ 8 ఏళ్లు వారంటీ ఇవ్వగా.. టాటా మోటార్స్ లైఫ్ టైం వారంటీ ఇస్తోంది.

Goldman Sachs అంచనా ప్రకారం చూసుకుంటే..ఈ ఏడాది అనగా 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ధరలు దాదాపు 33% పడిపోతాయని, 2030 సంవత్సరం నాటికి ఈ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ధరలు దాదాపు 66% తగ్గుతాయట.అంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఇప్పుడున్న సాంప్రదాయ ఇంధన ఇంజన్ ల వాహనాలతో సమాన ధరలకు చేరుకుంటాయని చెబుతున్నారు. ఫైనల్ గా చూసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనడం వల్ల బ్యాటరీలు తొందరగా మార్చవలసి వస్తుందనే అపోహను పక్కన పెట్టాలని,ఇప్పుడున్న ఆధునిక ఈవీ బ్యాటరీలు 10 నుండి 20 సంవత్సరాల వరకు పనిచేస్తాయని పెద్దపెద్ద కంపెనీలు ఈ EV కార్లు కొనే ముందే వారంటీ ఇస్తున్నాయి అని తెలుసుకోవాలంటూ EV కార్ల ఉత్పత్తిదారులు అంటున్నారు.