జేడీ వాన్స్ తో అలా హగ్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఎరికా కిర్క్
అక్టోబర్ 29న మిసిసిప్పీలో జరిగిన టర్నింగ్ పాయింట్ అమెరికా క్యాంపస్ ఈవెంట్ జరిగింది.
By: A.N.Kumar | 25 Nov 2025 4:08 PM ISTటర్నింగ్ పాయింట్ అమెరికా వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ మరణం తర్వాత.. అతని భార్య ఎరికా కిర్క్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ఆమె హత్తుకున్న దృశ్యం ప్రస్తుతం అమెరికా రాజకీయ వర్గాల్లో.. సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఈ వైరల్ హగ్‌పై వచ్చిన విమర్శలకు ఎట్టకేలకు ఎరికా కిర్క్ స్పందిస్తూ "అది నా లవ్ లాంగ్వేజ్" అంటూ క్లారిటీ ఇచ్చారు.
* భావోద్వేగ క్షణంలో వివాదం పుట్టింది
అక్టోబర్ 29న మిసిసిప్పీలో జరిగిన టర్నింగ్ పాయింట్ అమెరికా క్యాంపస్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా చార్లీ కిర్క్‌కు నివాళి అర్పిస్తున్న సమయంలో ఎరికా కిర్క్ భావోద్వేగానికి లోనై వేదికపైకి వచ్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలోనే జెడీ వాన్స్ ఆమె వైపు వచ్చి హత్తుకున్నారు.
ఎరికా ఆ క్షణాన్ని వివరిస్తూ “వీడియో ప్లే అవుతోంది… నేను ఏడుస్తూ స్టేజ్‌కి వస్తున్నాను… ఆయన కూడా అలా వస్తున్నారు. ఆపకుండా కన్నీళ్లు వచ్చాయి” అని చెప్పారు. హగ్ సమయంలో జెడీ వాన్స్ ఆమెకు “ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు’ అని చెప్పారని, దానికి ఆమె “గాడ్ బ్లెస్ యు’ అని బదులిచ్చారని తెలిపారు. అయితే హగ్ చేస్తూ వాన్స్ తల వెనక భాగాన్ని తాకిన హావభావమే ఈ వివాదానికి ప్రధాన కారణం అయ్యింది.
* ‘అది నా లవ్ లాంగ్వేజ్’ – నవ్వుతూ స్పందించిన ఎరికా
తన హావభావంపై వస్తున్న విమర్శలను ఎరికా కిర్క్ తేలికగా తీసుకున్నారు. “నేను ఎవరినైనా హగ్ చేస్తే అలా చేస్తాను. నన్ను ఎప్పుడైనా హగ్ చేసిన వారు దీన్ని తెలుసుకుంటారు. దాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్లకే హగ్ అవసరమన్న మాట,” అని స్పష్టం చేశారు.
జర్నలిస్ట్ మెగన్ కెల్లీ ఈ హగ్‌పై ఆన్‌లైన్ విమర్శలను ప్రస్తావిస్తూ, “అదేంటో… నువ్వు ఆయన వెనక భాగం తాకినట్టు రియాక్షన్ వచ్చేసింది!” అని అన్నప్పుడు ఎరికా నవ్వుతూ, “అలా చేసి ఉండి ఉంటే అంత హేట్ వచ్చుండేదేమో అనిపిస్తోంది,” అని సరదాగా జోక్ చేశారు.
* భవిష్యత్తులో హగ్గుల కోసం కొత్త రూల్!
ఈ వివాదం తర్వాత తాను కొంచెం జాగ్రత్తగా ఉన్నానని ఎరికా కిర్క్ తెలిపారు. నవ్వుతూ ఆమె ఇలా వ్యాఖ్యానించారు. “ఇక ముందు ఎవరికైనా హగ్ ఇస్తే… ‘నీకు అసలు సరైన హగ్ ఇవ్వలేదేమో… రా, నీ తల వెనక తాకాలి’ అని చెబుతా. నన్ను తెలిసినవారికి తెలుసు… నా లవ్ లాంగ్వేజ్ టచ్. ఒక హగ్‌పై హేట్ చూపేవారికి కూడా నిజానికి హగ్ అవసరం ఉంది. వారికి నేను ఉచితంగా హగ్ ఇస్తాను,” అని పేర్కొంటూ ఆ హగ్‌లో ఎలాంటి ఇతరార్థం లేదని, అది కేవలం ఒక భావోద్వేగ క్షణం అని మరోసారి స్పష్టం చేశారు.
వ్యక్తిగత విషాదం తర్వాత టర్నింగ్ పాయింట్ అమెరికా నాయకత్వాన్ని చేపట్టడం తన బాధ్యత అయ్యిందని ఎరికా బాధతో వివరించారు. చార్లీ కోరిక మేరకు సంస్థను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 2028 అధ్యక్ష ఎన్నికల్లో జెడీ వాన్స్‌కు మద్దతు ఇచ్చేందుకు సంస్థ ఇప్పటికే సిద్ధమవుతోందని ఎరికా ధృవీకరించారు. “2028లో జెడీకి బలమైన మద్దతు ఇవ్వాలని చార్లీ చివరిసారిగా పట్టుదలగా మాట్లాడిన విషయాల్లో ఒకటి” అని ఆమె వెల్లడించారు.
మొత్తం మీద ఒక భావోద్వేగ క్షణంలో జరిగిన హగ్‌ను పెద్ద వివాదంగా మార్చడంపై ఎరికా కిర్క్ విచారం వ్యక్తం చేశారు. “హగ్‌పై హేట్ చూపేవారికి కూడా హగ్ అవసరం ఉంది” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. జేడీ వాన్స్, ఈ విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు.
