Begin typing your search above and press return to search.

ఎప్ స్టీన్ సె*క్స్ స్కామ్ పత్రాలు.. స్లీజ్ బ్యాగ్స్ అంటూ ట్రంప్ నిప్పులు!

అమెరికాలో ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం ఎంత వివాదాస్పద విషయం అనేది తెలిసిందే. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, బడా వ్యాపారతవేత్తలు, ప్రపంచవ్యాప్త ప్రముఖులు ఉన్నారని అంటారు!

By:  Raja Ch   |   27 Dec 2025 9:25 AM IST
ఎప్ స్టీన్ సె*క్స్ స్కామ్ పత్రాలు.. స్లీజ్ బ్యాగ్స్ అంటూ ట్రంప్ నిప్పులు!
X

అమెరికాలో ఎప్ స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం ఎంత వివాదాస్పద విషయం అనేది తెలిసిందే. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, బడా వ్యాపారతవేత్తలు, ప్రపంచవ్యాప్త ప్రముఖులు ఉన్నారని అంటారు! ఈ నేపథ్యంలో గత నెలలో కాంగ్రెస్ ఒక ద్వైపాక్షిక బిల్లును ఆమోదించింది.. దీనిపై సంతకం చేసిన ట్రంప్ చట్టంగా మార్చారు.. దీని ప్రకారం ఎప్ స్టీన్ కు సంబంధించిన అన్ని రికార్డులని బహిరంగంగా పంచుకోవాలి.

దీనికి 30 రోజుల సమయం ఇవ్వబడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19వరకూ గడువు నిర్ణయించింది. ఇదే సమయంలో బాధితులను రక్షించడానికి చట్టం అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ దీనికి సంబంధించిన లక్షలాది పత్రాలను పంచుకుంది. వీటిలో అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గురించిన పలు విషయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. అన్ని పత్రాలు విడుదల చేయలేదు.. కొన్నింటిని వ్యూహాత్మకంగా ఆపేశారనే విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో డెమోక్రాట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్ స్టీన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. వాస్తవానికి అతన్ని అందరూ దూరం పెట్టడానికి ముందే తాను అతడితో సంబంధాలను తెంచుకున్నానని వ్యాఖ్యానించారు. ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్రిస్మస్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ స్లీజ్ బ్యాగ్స్ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.

అవును... "ఒకప్పుడు జెఫ్రీ ఎప్ స్టీన్ ను ప్రేమించి, అతనికి డబ్బు కట్టలు ఇచ్చి, అతని ద్వీపానికి వెళ్లి, అతడిచ్చిన పార్టీలకు హాజరై, అతన్ని భూమిపై ఉన్న గొప్ప వ్యక్తిగా భావించి, పరిస్థితులు హీటెక్కిన తర్వాత అతన్ని కుక్కలాగా వదిలేసేందుకు ప్రయత్నించిన అనేక మంది స్లీజ్ బ్యాగ్ లతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు" అని డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నావారిలో ఎక్కువ మంది డెమోక్రాట్లే అని ఆరోపించారు.

ఇదే సమయంలో... మీడియాపైనా ట్రంప్ నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా... ది న్యూయార్క్ టైమ్స్ పై తన దీర్ఘకాల విమర్శలను కొనసాగించారు. గత ఎన్నికలపై తప్పుడు నివేదికలు ఇచ్చారని.. అలాంటి నివేదికల వల్ల ఆ వార్తాపత్రిక క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని.. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో చందదారులను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు!

కాగా.. లైంగిక నేరస్థుడిగా నిర్ధారించబడిన జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించిన అనేక పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 19 నాటికి ఈ ఫైళ్లను పూర్తిగా విడుదల చేయాలని కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించిన తర్వాత.. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు సహా ఈ ఫైళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గడువులోగా అన్ని పత్రాలనూ విడుదల చేయలేమని చెప్పిన తర్వాత.. న్యాయశాఖపై పలు ఆరోపణలు వచ్చాయి.