Begin typing your search above and press return to search.

ఎప్ స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్... యూకేకి తొలి ముస్లిం ప్రధాని టాపిక్... ఆమెకు కశ్మీర్ తో సంబంధం ఇదే!

అవును... అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ కుంభకోణం వ్యవహారం ప్రపంచ దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

By:  Raja Ch   |   9 Feb 2026 6:37 PM IST
ఎప్ స్టీన్ ఫైల్స్  ఎఫెక్ట్... యూకేకి తొలి ముస్లిం  ప్రధాని టాపిక్... ఆమెకు కశ్మీర్  తో సంబంధం  ఇదే!
X

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో పీటర్ మాండెల్సన్ కు సంబంధాలు ఉన్నప్పటికీ.. కీలకమైన దౌత్య పదవికి ఆయనను సిఫార్స్ చేయడంలో తన పాత్రకు సంబంధించి బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీన్ ఆదివారం రాజీనామా చేయడంతో.. లేబర్ పార్టీ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తీవ్రతరమైందని అంటున్నారు. ఈ సమయంలో తెరపైకి కొత్త ప్రధానమంత్రికి ఛాన్స్ ఉందంటూ ఓ ముస్లిం మహిళ పేరు చర్చనీయాంశంగా మారింది.

అవును... అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ కుంభకోణం వ్యవహారం ప్రపంచ దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమయంలో ఎప్ స్టీన్ తో పీటర్ మాండెల్సన్ కు సంబంధాలు ఉన్నాయన్న విషయం తీవ్ర చర్చనీయాంశం కావడం.. ఆ కారణంతో యూకే పీఎం చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీన్ రాజీనామా చేయడంతో.. ప్రధానిగా కీర్ స్టార్మర్ భవిష్యత్తుపై పలు కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

ఈ సమయంలో కీర్ స్టార్మర్ వారసురాలిగా విదేశాంగ కార్యదర్శి షబానా మహమూద్ పేరుపై చర్చ మొదలైంది. నిజంగా అదే జరిగితే.. యూకే మొదటి ముస్లిం ప్రధానమంత్రిగా షబానా చరిత్ర సృష్టిస్తారు.

ఎవరీ షబానా మహమూద్..!:

యూకే శాసనసభ్యురాలు.. 45 ఏళ్ల షబానా మహమూద్.. ప్రధానమంత్రి కీర్ స్టార్మార్ కు కీలక మిత్రురాలని.. లేబర్ పార్టీ మంచి వక్త అని అంటారు. జుబైదా - మహమూద్ అహ్మద్ దంపతులకు బర్మింగ్ హోమ్ లో జన్మించిన షబానాకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని మీర్పూర్ పట్టణంలో తన మూలాలను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆమె 2002లో ఆక్స్ ఫర్డ్ లోని లింకన్ కాలేజీ నుంచి న్యాయ పట్టా పొందారు!

ఈ క్రమంలో... గత ఏడాది యుకే హోం కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత.. ఆమెకు యూకే సరిహద్దు భద్రతను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఆమె 2010లోనే తొలిసారిగా యూకేలోని తొలి మహిళా ముస్లిం ఎంపీలలో ఒకరిగా నిలిచారు. అయితే... తాజాగా కీర్ స్టార్మర్ వారసురాలిగా ఆమె పేరు తెరపైకి వచ్చినా... మాజీ డిప్యుటీ ప్రధాని ఏంజెలా రేనర్, ఆరోగ్య కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ నుంచి గట్టిపోటీ ఉందని అంటున్నారు!