బెడ్ పై కాదు బాసూ.. మైదానంలో 'ఆట' కోసమే! ఇంగ్లండ్ ప్లేయర్ల 'వయాగ్రా' ప్లాన్
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా రౌండ్-16 మ్యాచ్‌లో మెక్సికోతో తలపడేందుకు ఇంగ్లండ్ టీమ్ రెడీ అవుతోంది.
By: A.N.Kumar | 4 July 2026 3:22 PM ISTవయాగ్రా.. ఈ పేరు వినగానే మనోళ్ల మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బెడ్‌రూమ్, రొమాన్స్, కిర్రాక్ పర్ఫార్మెన్స్.. ఇవే గుర్తొస్తాయి. కానీ త్వరలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్లు ఈ ట్యాబ్లెట్లను నమలబోతున్నారు. అది కూడా బెడ్ రూమ్ లో కాదు బాసూ.. సాకర్ మైదానంలో ప్రత్యర్థులను కుమ్మేయడానికి.. ఏంటి షాకయ్యారా? "ఏంది సామీ ఈ వింత.. ఫుట్‌బాల్ మ్యాచ్‌కి, వయాగ్రాకి లింకేంటి?" అని బుర్ర గోకేసుకుంటున్నారా? అయితే ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చదవాల్సిందే.
అసలు కథేంటంటే.. ఆక్సిజన్ తిప్పలు!
ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా రౌండ్-16 మ్యాచ్‌లో మెక్సికోతో తలపడేందుకు ఇంగ్లండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే మ్యాచ్ జరగబోయే మెక్సికో సిటీలోని ‘ఎస్టాడియో అజ్టెకా’ స్టేడియం భూమికి జానెడు ఎత్తులో లేదు.. ఏకంగా సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తుకు వెళ్తే ఏమవుతుంది? గాల్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. సాధారణంగానే గ్రౌండ్‌లో చెమటోడ్చే ప్లేయర్లు, అక్కడ రెండు రౌండ్లు వేస్తేనే నాలుకలు బయటపడేసి, ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. దాన్నే మెడికల్ భాషలో ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ అంటారు. మరి ఈ తిప్పల నుంచి తప్పించుకోవడానికి ఇంగ్లండ్ టీమ్ మెడికల్ స్టాఫ్ ఓ క్రేజీ ఐడియా కనిపెట్టింది. అదే.. ప్లేయర్లకు వయాగ్రా ఇవ్వడం!
సైన్స్ ఏం చెప్తోందంటే..
సోషల్ మీడియాలో జనాలు ఊహించుకుంటున్నట్టు ‘ఆ’ పర్ఫార్మెన్స్ పెంచడానికి కాదు బ్రదర్.. వయాగ్రా టాబ్లెట్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తప్రసరణ జోరందుకుంటుంది. ఫలితంగా తక్కువ ఆక్సిజన్ ఉన్నా సరే, బాడీ యాక్టివ్‌గా ఉండి, ప్లేయర్లు అలసిపోకుండా మైదానంలో చిరుతపులుల్లా పరిగెడతారట. అంటే ఇక్కడ వయాగ్రా అనేది 'సెక్స్ టానిక్' కాదు.. ఊపిరితిత్తులకు 'బూస్ట్' అన్నమాట.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రూల్స్ ప్రకారం వయాగ్రా వాడకం తప్పు కాదు. ఇది నిషేధిత డ్రగ్స్ లిస్ట్‌లో లేదు కాబట్టి, ఇంగ్లండ్ టీమ్ లీగల్‌గానే ఈ 'మ్యాజిక్ పిల్' వేసుకోబోతోంది.
సోషల్ మీడియా ట్రోల్స్.. నెటిజన్ల పండగ
ఈ వార్త బయటికి రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. "మ్యాచ్ గెలవకపోయినా పర్లేదు భయ్యా.. మ్యాచ్ అయ్యాక ప్లేయర్ల పరిస్థితి ఏంటి?" అని కొందరు.. "ఇంగ్లండ్ ప్లేయర్ల షాట్స్ గ్రౌండ్ లో గోల్ పోస్ట్‌కి తగులుతాయా.. లేక ఆకాశంలో ఉన్న చందమామకి తగులుతాయా?" అని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఏది ఏమైనా ఇంగ్లండ్ ప్లేయర్లు మ్యాచ్ గెలవడానికి ఎంత ‘గట్టి’ ప్రయత్నాలైనా చేస్తారని ఈ నిర్ణయంతో నిరూపించారు. మరి ఈ వయాగ్రా ప్లాన్ వర్కవుట్ అయ్యి మైదానంలో ఇంగ్లండ్ ప్లేయర్లు మెక్సికో ఆట కట్టిస్తారో లేదో చూడాలి.
