Begin typing your search above and press return to search.

జీతం పడ్డ 5 నిమిషాలకే ఉద్యోగి రాజీనామా.. HR ఏమన్నారంటే?

ఆయనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేకపోతే జాయిన్ అయ్యే ముందే చెప్పొచ్చు కదా.. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత శాలరీ పడిన వెంటనే ఇలా చేయడం సమంజసం కాదు అంటూ తెలియ జేసింది.

By:  Madhu Reddy   |   10 Aug 2025 3:00 PM IST
జీతం పడ్డ 5 నిమిషాలకే ఉద్యోగి రాజీనామా.. HR ఏమన్నారంటే?
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొన్ని విషయాలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. కొన్ని కొన్ని సిల్లీ విషయాలైనా అవి జనాలకు ఎంతో ఉపయోగపడేవిగా ఉంటున్నాయి. అంతేకాదు అవి చర్చకు కూడా దారి తీస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఉద్యోగి శాలరీ పడిన ఐదు నిమిషాలకే రిజైన్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు..అసలు ఏం జరిగింది అనే వివరాలు చూద్దాం..

ఒక కంపెనీలో పని చేస్తున్నటువంటి ఉద్యోగి అకస్మాత్తుగా ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఎలాగంటే ఆయనకు శాలరీ పడిన ఐదు నిమిషాలకే తన హెచ్ఆర్ కు రిజైన్ లెటర్ పంపించాడు. అయితే ఆ ఉద్యోగికి 10 గంటలకు శాలరీ అకౌంట్ లో క్రెడిట్ అయింది.. ఆ తర్వాత ఐదు నిమిషాలకు ఆయన రిజైన్ లెటర్ తన బాస్ కు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించినటువంటి హెచ్ఆర్ ప్రియవర్షిణి ఈ విషయాన్ని లింక్డ్ ఇన్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకి దారి తీసింది. మా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి 10 గంటలకు జీతం పడితే, 10:05 నిమిషాలకు రిజైన్ చేసినట్టు మెయిల్ పంపించాడని ఆమె తెలియజేసింది. ఇది నైతికమేనా..?అసలు దీన్ని ఎవరైనా సమర్థిస్తారా ? అంటూ పోస్టులో ప్రశ్నించింది.

ఆయనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేకపోతే జాయిన్ అయ్యే ముందే చెప్పొచ్చు కదా.. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత శాలరీ పడిన వెంటనే ఇలా చేయడం సమంజసం కాదు అంటూ తెలియ జేసింది. ట్రైనింగ్ సమయంలో చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఆ టైంలోనే తనకున్న ఇబ్బంది గురించి చెబితే బాగుండేది కదా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆయనకు పరిపక్వత లోపించినట్టా.. ? లేదా బాధ్యతాయుతంగా లేనట్టా? అంటూ ప్రశ్నించింది. ఆ ఉద్యోగి ఇలా చేయడం కంపెనీ యాజమాన్యాలతో పాటు తన తోటి ఉద్యోగులకు కూడా తప్పుడు సంకేతాలు ఇస్తుందని ప్రియవర్షిణి పేర్కొంది.

ప్రస్తుతం ఈ పోస్టు లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడంతో వేలాదిమంది లైక్ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.. కొందరు నెటిజన్స్ ఆ ఉద్యోగి నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరి కొంత మంది HR ని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మీరు ఏవేవో కారణాలు చెప్పి ఉద్యోగులను సడన్ గా పీకేస్తారు. అలాంటప్పుడు ఆ ఉద్యోగి బ్రతుకు ఏం కావాలి.. ? అలాంటి సమయంలో మీరు ఈ విధంగా పోస్టులు చేస్తారా? అంటూ కామెంట్స్ పెట్టాడు..

మరో వ్యక్తి దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు.. స్వేచ్ఛా జీవిగా జీవించు.. ఉద్యోగంలోకి ఎంటరై జీవితాన్ని మరొకరి చేతిలో పెట్టడం వేస్ట్ అంటూ మాట్లాడారు.. ఇంకొకరు మీరు హెచ్ఆర్ అయి ఉండి ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం సమంజసం కాదు..మీరు ఎంత పరిపక్వతతో ఉన్నారో ఈ పోస్ట్ తెలియజేస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరొకరు స్పందిస్తూ.. ఆ వ్యక్తి తన భవిష్యత్తు అంధకారం కాబోతుందని ముందుగానే గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అంటూ మాట్లాడాడు.. ఇంకో నెటిజన్ ఆకాశం ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించదు మేఘాల గర్జనలన్నీ కూడా వినిపించేనా.. అందుకే అతని నిర్ణయం ఆ విధంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు..

ఇంకొందరేమో అతనికి ఆ లొకేషన్ నచ్చకపోవచ్చు, అక్కడ చేస్తున్న తోటి ఉద్యోగులతో సరిగ్గా కలవకపోవచ్చు..అందుకే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఉద్యోగి శాలరీ పడ్డ ఐదు నిమిషాలకు రాజీనామా చేయడంతో ఆయనపై రకరకాలుగా స్పందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.