Begin typing your search above and press return to search.

ఒక వైపు కన్నీళ్లు… మరో వైపు కోట్ల లాభాలు! వైరల్ కంటెంట్ వెనుక సీక్రెట్

సోషల్ మీడియాలో మనం చూసే ఒక ఎమోషనల్ వీడియో వెనుక ఏముంటుంది? కేవలం బాధ మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే! ఆ కన్నీళ్ల వెనుక కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యం దాగుంది.

By:  Madhu Reddy   |   27 Feb 2026 4:00 AM IST
ఒక వైపు కన్నీళ్లు… మరో వైపు కోట్ల లాభాలు! వైరల్ కంటెంట్ వెనుక సీక్రెట్
X

సోషల్ మీడియాలో మనం చూసే ఒక ఎమోషనల్ వీడియో వెనుక ఏముంటుంది? కేవలం బాధ మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే! ఆ కన్నీళ్ల వెనుక కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యం దాగుంది. మీ ఎమోషన్స్ వారి బ్యాంక్ బ్యాలెన్స్‌ని పెంచుతున్నాయి. మనం స్టేటస్‌లు పెట్టుకుంటూ బిజీగా ఉంటే, ఎవరో అదే సమయంలో 200 కోట్లు వెనకేస్తున్నారు. ఇక్కడ మీ ప్రతి క్లిక్ ఒకరి లాభం. ఈ డిజిటల్ మాయాజాలం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ ప్రపంచంలో దేన్నీ గుడ్డిగా నమ్మే రోజులు పోయాయి. ఒక వీడియో వైరల్ అవుతుందంటే దాని వెనుక పెద్ద బిజినెస్ స్ట్రాటజీలు ఉండొచ్చు. మనం ఎమోషనల్ అయిపోయి వాటిని స్టోరీలు పెడుతుంటే, ఎవరో మన టైమ్‌ను వాడుకుని బిలియనీర్లు అయిపోతున్నారు. అందుకే, ఏదైనా చూసేటప్పుడు కేవలం ఎమోషన్ సైడ్ మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న లాజిక్‌ను కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. చూసే కంటెంట్‌లో నిజమెంత? దాని వెనుక ఉన్న మార్కెటింగ్ ఎంత? అని ఆలోచించడం మొదలుపెడితే మీరు కూడా ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడొచ్చు. చివరికి మిగిలేది ఒకటే ప్రశ్న, ఎమోషనా? లాజికా?. మనం ఎటు వైపు వున్నాం అన్నది ఆలోచించాలి.

మీ ఎమోషన్ వారి ఇన్వెస్ట్‌మెంట్:

మనం ఏదైనా ఎమోషనల్ వీడియో చూసినప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోయి షేర్లు, లైకులు కొట్టేస్తాం. కానీ ఈ 'అటెన్షన్ ఎకానమీ'లో మీ ఎమోషన్ అనేది ఒక ప్రొడక్ట్. మీరు ఒక వీడియో కోసం ఇచ్చే ప్రతి సెకను వారికి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. రీసెంట్‌గా ఒక పంచ్ కోతి గురించి పెట్టిన వీడియో అందరూ మాట్లాడుకుంటే, అదే సమయంలో ఆ వైరల్ ట్రెండ్‌ను వాడుకుని ఒక వ్యక్తి ఏకంగా 200 కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేశారంటే నమ్ముతారా? మీరు బాధలో ఉన్నారో, ఆనందంలో ఉన్నారో వాళ్లకు అనవసరం.. మీ అటెన్షన్ వాళ్లకి దొరికిందా లేదా అన్నదే పాయింట్. ప్రతి వైరల్ కంటెంట్ వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందేమో అని డౌట్ వస్తుంది.

ఐక్య బొమ్మల నుండి క్రిప్టో వరకు.. అంతా పక్కా స్కెచ్:

ప్రమోషన్లు అనేవి ఇప్పుడు చాలా స్మార్ట్‌గా మారిపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన పంచ్ కోతి వీడియోలో బొమ్మ ఐక్య (IKEA) కంపెనీ నుండి తీసుకొచ్చినది. వీడియో వైరల్ అయ్యాక ఆ బొమ్మ మొత్తం అమ్ముడు అయ్యాయి అంటే నమ్ముతారా? ఇక ఈ పాయింట్ మీద IKEA వాళ్ళు కొన్ని బొమ్మలను ఆ జూ కి పంపించి ప్రమోట్ చేసారు. అది చూడటానికి సహజంగా ఉన్నా, దాని వెనుక బ్రాండ్ డీల్స్ ఉంటాయి. ఇక అలాగే క్రిప్టో మీమ్ కాయిన్స్ విషయంలోనూ అంతే! ఏదైనా ఒక విషయం వైరల్ అవుతుంటే, దాన్ని బేస్ చేసుకొని కొత్త కాయిన్స్ క్రియేట్ చేయడం, మార్కెట్ చేయడం ద్వారా కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నారు. అంటే ఒక పక్క కన్నీళ్లు, కథలు నడుస్తుంటే.. మరో పక్క నంబర్లు, ప్రాఫిట్స్ యమ స్పీడుగా పెరిగిపోతుంటాయి. మనం కేవలం గేమ్‌ను చూస్తున్నాం, కానీ వాళ్ళు గేమ్‌ను ఆడుతున్నారు.