Begin typing your search above and press return to search.

ఎంపీ పుట్టా మహేష్ సంచలన వీడియో

ఇలా ఒక్క రోజులో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఈ మొత్త్తం వివాదానికి కేరాఫ్ అన్నట్లుగా మారారు.

By:  Satya P   |   16 March 2026 9:36 AM IST
ఎంపీ పుట్టా మహేష్ సంచలన వీడియో
X

గత ఇరవై నాలుగు గంటలుగా ఒక్కటే న్యూస్, టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు అని అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇటు సోషల్ మీడియా ఒక్కసారిగా న్యూస్ తో షేక్ చేసి పారేశాయి. దాని మీద రాజకీయ పార్టీలు కూడా ఘాటుగా రియాక్టు అవుతున్నాయి. ఏపీలో అయితే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఎటాక్ మొదలైపోయింది. అదే సమయంలో తెలంగాణాలోనూ ప్రకమపనలు రేగాయి. ఇలా ఒక్క రోజులో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఈ మొత్త్తం వివాదానికి కేరాఫ్ అన్నట్లుగా మారారు.

టీడీపీ సీరియస్ :

ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో సీరియస్ గానే స్పందించింది ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మహేష్ యాదవ్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయడం నలభై ఎనిమిది గంటలలోగా తన వివరణ ఈ విషయంలో ఇచ్చుకోవాలని అందులో పేర్కొనడం అంతవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పుట్ట మహేష్ యాదవ్ అన్ని వైపుల నుంచి కార్నర్ అయిన పరిస్థితి కనిపించింది.

నేను తప్పు చేయలేదు :

ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ ఒక సంచలన వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఆయన చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఏ తప్పూ చేయలేదని మహేష్ సమర్ధించుకున్నారు అంతే కాదు తాను కేవలం కొందరి పిలుపు మేరకు మాత్రమే వీకెండ్ డిన్నర్ కి అటెండ్ అయ్యారు అని చెప్పారు చాలా కాలంగా తనను కలవాలని కొంతమంది కోరుతూండడంతో ఆను ఆ డిన్నర్ కి వెళ్ళాల్సి వచ్చింది అని మహేష్ చెప్పారు. ఇక తన మీద ఏలూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయని అని కూడా మహేష్ స్పష్టం చేశారు. ఇక మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కధనాలు ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు తాను ఎపుడూ నిజాలే చెబుతాను తప్ప అబద్ధాలు చెప్పను అని కూడా ఆయన వివరణ ఇచ్చారు.

జస్ట్ డిన్నర్ మాత్రమే :

తాను డిన్నర్ కి మాత్రమే అటెండ్ అయ్యాను అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ ఏ తప్పూ చేయలేదని అంటే డ్రగ్స్ వంటివి తాను స్వీకరించలేదని ఆయన చెప్పకనే చెప్పారు అన్న మాట. అదే సమయంలో తాను నిజయాతీగా ఉంటాను అని చెప్పారు. తనను నమ్మాలని కోరారు. మొత్తానికి అదివారం రోజంతా పెద్ద ఎత్తున హోరెత్తించిన ఈ హాట్ హాట్ టాపిక్ కి రాత్రి పొద్దు పోయిన తరువాత మహేష్ రిలీజ్ చేసిన వీడియో బైట్ అయితే ఆయన వెషన్ గానే ఉంది. ఆవేదనతో ఆందోళనతో కూడిన స్వరంతో అందులో మహేష్ కనిపించారు, వినిపించారు. మరి దీని మీద ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.