Begin typing your search above and press return to search.

మస్క్ కుమారుడి పేరు శేఖర్... ఎందుకో తెలుసా?

ఈ సందర్భంగా స్పందించిన మస్క్... మీకు ఇది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ... నా భాస్వామి శివోన్ సగం భారతీయురాలు అని తెలిపారు.

By:  Raja Ch   |   1 Dec 2025 9:37 AM IST
మస్క్  కుమారుడి పేరు శేఖర్... ఎందుకో తెలుసా?
X

టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కుమారుడి పేరు 'శేఖర్ ' అని తెలుసా? ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? తాజా ఈ విషయాన్ని ఎలోన్ మస్క్ వెల్లడించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్ లో మాట్లాడిన మస్క్ తన భాగస్వామి, కుమారుడి పేరుపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... ఎలోన్ మస్క్ తన భాగస్వామి, న్యూరాలింక్ ఎగ్జిక్యుటివ్ శివోన్ జిలిస్ కు భారతీయ వారసత్వం ఉందని చెబుతూ.. తన కుమారుడికి నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ-అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం మిడిల్ నేమ్ ‘శేఖర్’ అని పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. జిలిస్ నేపథ్యం, కుటుంబం గురించి వివరించారు.

ఈ సందర్భంగా స్పందించిన మస్క్... మీకు ఇది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ... నా భాస్వామి శివోన్ సగం భారతీయురాలు అని తెలిపారు. ఇక, ఆమెతో నా కొడుకులలో ఒకరికి మధ్య పేరుగా శేఖర్ అని అన్నారు. కాగా.. చంద్రశేఖర్ నక్షత్రాల నిర్మాణం, ముఖ్యమైన భౌతిక ప్రక్రియల అధ్యయనాలపై చేసిన కృషికి 1983లో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి అందుకున్నారు!

మస్క్ భాగస్వామికి భారత్ తో సంబంధం..!:

ఈ కార్యక్రమంలో.. తన భాగస్వామికి శివోన్ జిలిస్ కు భారత్ తో ఉన్న సంబంధం పెంపకం ఆధారంగా కాకుండా పూర్వికుల నుంచి వచ్చిందని మస్క్ అన్నారు. ఆమె కెనడాలో పెరిగిందని.. ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఆమెను దత్తత కోసం ఇచ్చారని తెలిపారు. అయితే మస్క్ ఆమె జీవ సంబంధమైన కుటుంబం గురించి మరిన్ని వివరాలను మాత్రం అందించలేదు!

ఎవరీ శివోన్ జిలిస్..?:

శివోన్ జిలిస్ చాలా కాలంగా టెక్, ఏఐ ప్రొఫెషనల్ గా ఉన్నారు. ఆమె 2017లో న్యూరాలింక్ లో చేరారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం కంపెనీ ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్ ల డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె యేల్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం అభ్యసించారు. ఏఐపై జరిగిన కెనడియన్ అండర్ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ లో జిలిస్ న్యూరాలింక్ ను తన జీవితలో ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్టమైన, అదే సమయంలో మనోహరమైన విషయంగా అభివర్ణించారు.