పోరాడండి.. లేదా చనిపోండి.. లండన్ నిరసనలపై ఎలన్ మస్క్ సంచలనం
లండన్ లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతు పలికారు.
By: A.N.Kumar | 14 Sept 2025 1:59 PM ISTలండన్ లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. "పోరాడండి లేదా చనిపోండి" అంటూ నిరసనకారులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
నిరసనకారులకు మస్క్ మద్దతు
'యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీలో లక్షకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వర్చువల్‌గా హాజరైన మస్క్ బ్రిటన్‌లో పెరుగుతున్న వలసలపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. బ్రిటన్ నెమ్మదిగా విధ్వంసానికి గురవుతోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హింస తప్పదని హెచ్చరించారు.
'తిరిగి పోరాడండి లేదా చనిపోండి'
నిరసనకారులతో మాట్లాడుతూ మస్క్ "మీపైకి హింస వస్తుంది. మీరు హింసను ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా అది తప్పదు. మీకు ఉన్న ఒకే ఒక్క మార్గం... తిరిగి పోరాడటం లేదా చనిపోవడం, ఇదే నిజం" అని అన్నారు.
ప్రభుత్వ మార్పుకు పిలుపు
బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని మస్క్ పిలుపునిచ్చారు. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని కోరారు.
చార్లీ కిర్క్ హత్య ప్రస్తావన
అమెరికాలో ఇటీవల హత్యకు గురైన ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ హత్యను కూడా మస్క్ ప్రస్తావించారు. రాజకీయ వామపక్షాలు హింసకు పాల్పడుతున్నాయని, తన స్నేహితుడు కిర్క్‌ను హత్య చేసి దానిని వేడుకగా జరుపుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
