Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు 9 వేల కోట్ల పెట్టుబ‌డులు: రేవంత్ రియాక్ష‌న్ ఇదే!

పెట్టుబ‌డుల వేట‌లో ఉన్న తెలంగాణకు తాజాగా 9 వేల కోట్ల రూపాయ‌ల‌ మేర‌కు పెట్టుబ‌డులు ల‌భించాయి.

By:  Garuda Media   |   6 Oct 2025 5:52 PM IST
తెలంగాణ‌కు 9 వేల కోట్ల పెట్టుబ‌డులు:  రేవంత్ రియాక్ష‌న్ ఇదే!
X

పెట్టుబ‌డుల వేట‌లో ఉన్న తెలంగాణకు తాజాగా 9 వేల కోట్ల రూపాయ‌ల‌ మేర‌కు పెట్టుబ‌డులు ల‌భించాయి. `ఎలి లిల్లీ` సంస్థ రాష్ట్రంలో పెట్ట‌బ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ సంస్థ ఔష‌ధ త‌యా రీ రంగంలో అగ్ర‌గామిగా ఉంది. ఆ సంస్థ అమెరికా నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా కార్య‌క‌లాపాలు నిర్వహిస్తోం ది. ఈ క్ర‌మంలో తాజాగా ఇప్పుడు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన ఎలి లిల్లీ సంస్థ స్థాప‌కులు ప్యాట్రిన్ జాన్స‌న్‌ త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వా నికి వివ‌రించారు.

ఫార్మా రంగంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తున్న తీరుకు తాము ముగ్ధుల‌మ‌య్యామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డుల‌కు రెడీ అయిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబ‌డులు పెట్టేవారికి.. త‌మ ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. సింగిల్ విండో విధానంలోనే అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు వివ‌రించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు.

రాష్ట్రాన్ని ఫార్మా హ‌బ్‌గా తీర్చిదిద్దుతున్న‌ట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. దీనిద్వారా అన్ని ఫార్మా కంపెనీల‌కు అవ‌స‌ర‌మైన ఉద్యోగుల‌ను తీర్చి దిద్దుతున్న‌ట్టు తెలిపారు. ఫార్మాకు సంబంధిం చిన నిపుణులు ఈ విశ్వ‌విద్యాల‌యంలో స‌భ్యులుగా ఉంటార‌ని చెప్పారు. నాణ్య‌మైన ఔష‌ధాల త‌యారీకి ప్ర‌భుత్వం నుంచి గ‌ణ‌నీయ‌మైన ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని వివ‌రించారు.