ఏంటీ..20 ఏళ్లకే కూల్చేద్దామని ఐఫిల్ టవర్ నిర్మించారా.. దీని వెనుక అసలు కథ ఏంటంటే?
పారిస్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఐఫిల్ టవర్ మాత్రమే..ఎంతోమంది ప్రేమికులు ఐఫిల్ టవర్ ని తమ ప్రేమకు చిహ్నంగా అనుకుంటారు.
By: Madhu Reddy | 8 Oct 2025 4:03 PM ISTపారిస్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఐఫిల్ టవర్ మాత్రమే..ఎంతోమంది ప్రేమికులు ఐఫిల్ టవర్ ని తమ ప్రేమకు చిహ్నంగా అనుకుంటారు. పైగా అలాంటి ఐఫిల్ టవర్ పారిస్ కి ఒక ఆకర్షణగా కూడా నిలిచింది. అయితే పారిస్ దేశానికి ఇప్పుడైతే ఈ ఐఫిల్ టవర్ ఆకర్షణగా నిలిచింది. కానీ ఒకప్పుడు దీనిని చూసి చాలామంది భయపడేవారు. అంతేకాదు దీన్ని ఎంతోమంది పనికిరానిది, విషాదకరమైన వీధి దీపం, భయంకరమైనది అని పిలిచేవారు. నమ్మిన నమ్మకపోయినా ఐఫిల్ టవర్ కట్టిన సమయంలో దీన్ని అందరూ ఇలాగే ఊహించుకున్నారట. అంతేకాదు ఈ ఐఫిల్ టవర్ ను కట్టిన 20 సంవత్సరాలకే కూల్చి వేయాలి అని కూడా అనుకున్నారు. మరి దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి.. ? ఎందుకు కట్టిన 20 ఏళ్లకే ఈ ఐఫిల్ టవర్ ని కూల్చేద్దాం అనుకున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1884 జూన్లో ఎమిలే నౌగియర్, మారిస్ కోచ్లిన్ అనే ఇద్దరు ఇంజనీర్లు పారిస్ దేశాన్ని సందర్శించి 300 మీటర్ల ఐఫిల్ టవర్ ని నిర్మించాలని కలలు కన్నారు. అయితే ఈ విషయాన్ని వాళ్ళ యజమాని గుస్తావ్ ఐఫెల్ కి చెప్పగా.. ఆయన కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించి, టవర్ ని కట్టమని చెప్పారు.అలా 1889 నాటికి ఈ టవర్ నిర్మించారు.అయితే ఐఫిల్ టవర్ కట్టిన టైంలో ఇన్ని సంవత్సరాలు ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఈ నిర్మాణాన్ని పారిస్ లో కేవలం 20 సంవత్సరాలు ఉంచడానికి మాత్రమే ఐఫెల్ పర్మిషన్ తీసుకున్నారు. 1910 సంవత్సరంలో ఐఫిల్ టవర్ ని కూల్చివేయాలని అనుకున్నారు.
అంతేకాదు అప్పట్లో కొన్ని వార్తాపత్రికల్లో ఐఫిల్ టవర్ గురించి కొంతమంది రచయితలు పనికిరాని నిర్మాణం, భయంకరమైన నిర్మాణం అని రాస్కొచ్చారు. ఇంకొంతమంది రచయితలు బాబెల్ టవర్,విషాదకరమైన వీధి దీపం అంటూ వర్ణించారు. అలాగే అందమైన పారిస్ నగరంలో ఈ టవర్ చాలా అసహ్యంగా కనిపిస్తుందని, అక్కడి ప్రముఖులు ఐఫిల్ టవర్ పై విమర్శలు చేశారు. దీన్ని కూల్చివేయాలని ప్రయోగాలు చేసినప్పటికీ దీని నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన గుస్తాన్ ఐఫెల్ ఒక వ్యూహకర్త కావడంతో ఆయన ఈ టవర్ ని కూల్చివేయకుండా ఉండడానికి దాన్ని ఉపయోగకర టవర్ గా మార్చాడు.
అలా ఐఫిల్ టవర్ పై భాగాన్ని వాతావరణ పరిశోధన, రేడియో టెలిగ్రాఫి, వైర్లెస్ ప్రచారాలకు కేంద్రంగా మార్చాడు ఐఫెల్.. అంతేకాదు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఐఫిల్ టవర్ కి ఉన్న యాంటెన్నాలు జర్మన్ సైన్యం కదలికలకు సంబంధించి కీలక సమాచారాలు ఇచ్చింది. అలా 20 ఏళ్లకే కూలిపోవాల్సిన ఈ ఐఫిల్ టవర్ ప్రస్తుతం ప్రపంచానికే అద్భుత సందర్శన స్థలంగా మారిపోయింది.
