Begin typing your search above and press return to search.

'సూప‌ర్ లేటివ్' ఎమ్మెల్యేలను వాడుకోలేక పోతున్నారే.. !

దాదాపు అన్ని పార్టీల్లోనూ ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు(సూప‌ర్ లేటివ్‌)గా ఉన్న నాయకులు ఉన్నారు.

By:  Garuda Media   |   10 Nov 2025 8:00 AM IST
సూప‌ర్ లేటివ్ ఎమ్మెల్యేలను వాడుకోలేక పోతున్నారే.. !
X

దాదాపు అన్ని పార్టీల్లోనూ ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు(సూప‌ర్ లేటివ్‌)గా ఉన్న నాయకులు ఉన్నారు. కొందరు డాక్టర్లు మరికొందరు ఇంజనీర్లు ఇంకొందరు ఎకనామిక్స్ లోను నిపుణులైనటువంటి నాయకులు ఉండడం విశేషం. వీరంతా ఇటు వైసీపీలోనూ అటు టిడిపిలోనూ మరోవైపు జనసేనలో కూడా ఉన్నారు. అయితే వీరు రాజకీయంగా ఏ మేరకు ఆయా పార్టీలకు పనిచేస్తున్నారు. ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్నదే ప్రశ్న. మేధావులు రాజకీయాల్లోకి రావడం లేదు. అని ఒక పెద్ద విమర్శ అయితే ఉంది.

కానీ, వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వారిలో 134 మంది ఎమ్మెల్యేలు టిడిపికి ఉంటే వీరిలో ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వారు.. అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ సహా చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వారు కూడా దాదాపు 36 మంది ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల అఫిడ‌విట్‌లో ఇచ్చిన వివ‌రాల‌ను పరిశీలిస్తే ఈ విషయాలు తెలుస్తాయి. చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంజనీర్లు కూడా ఉన్నారు. అయితే ఇంతమంది గెలిచినప్పటికీ కూడా వారు ఏ మేరకు ప్రజలకు చెరువుగా ఉన్నారు లేకపోతే ప్రభుత్వానికి ఏ మేరకు దోహదపడుతున్నారు అన్నది మాత్రం పరిశీలిస్తే పెద్దగా స్పందన కనిపించడం లేదు.

ఇక జనసేన తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. వీరంతా అత్యున్నత స్థాయి చదువును చదివారు. ఒకరిద్దరైతే ఫారెన్ లో కూడా చదువుకుని వచ్చినటువంటి అభ్యర్థులు కూడా జనసేనలో ఉన్నారు. ఇక బిజెపిలోను ఒకరిద్దరు నాయకులు ఉన్నత విద్యను చదువుకున్నారు. కొందరు ఎన్నారైలుగా కూడా ఉన్నారు. గతంలో ఉద్యోగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా కనిపిస్తున్నారు. కానీ వీరు ప్రజలకు చేరువ కావడం లేదు అన్నది ప్రధాన విమర్శ.

మరి దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, అనే విషయాలపై ఆయా పార్టీల నాయకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుకున్న వారు మౌనంగా ఉంటే ప్రమాదం ఉందన్నది వాస్తవం ఉంది. కాబట్టి ఉన్నత విద్యావంతులైన వారు ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్న నేపథ్యంలో వారిని వినియోగించుకునే విషయంలో వారిని రాజకీయంగా యాక్టివ్ చేసే విషయంలో ఆయా పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.