రాబర్ట్ వాద్రాపై ఈడీ రెండో చార్జిషీట్
కాంగ్రెస్ అగ్ర నేత ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది.
By: Satya P | 21 Nov 2025 12:50 AM ISTకాంగ్రెస్ అగ్ర నేత ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రాబర్ట్ వాద్రా వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇక బ్రిటన్ కి చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండరీ కేసుతో అనుసంధానంగా ఉన్న మనీ లాండరింగ్ కేసు మీద చార్జి షీటుని ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దీంతో ఈ కేసులో రాబర్ట్ వాద్రా మీద కూడా చార్జి షీటు దాఖలు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాబర్ట్ వాద్రా మీద మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి దాఖలైన రెండవ చార్జిషీటుగా దీనిని పేర్కొంటున్నారు.
భూముల వ్యవహారంలో :
ఇక ఇదే ఏడాది జూలై నెలలో షికోపూర్ భూముల వ్యవహరానికి సంబంధించి రాబర్ట్ వాద్రా మీద చార్జిషీటుని తొలిసారి ఈడీ ఫైల్ చేసి కోర్టుకు దాఖలు చేసింది దాంతో అప్పట్లో అది కొంత సంచలనం అయింది ఇపుడు వరసగా రెండవది అది కూడా కొద్ది నెలల తేడాతోనే జరగడంతో రాబర్ట్ వాద్రా విషయం మీద చర్చ అయితే సాగుతోంది.
ఆయుధ వ్యాపారి ఎవరు :
ఇక ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో బ్రిటన్ కి చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఉన్నారు. ఆయన ఎవరు ఈడీ ఆయన కేసులో ఎందుకు దూకుడు చూపిస్తోంది అంటే పదేళ్ళ క్రితమే ఆయన మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు అని అంటున్నారు. అలా 2016లో ఆయన నుంచి డిజిటల్ డేటాను అలగే ఇతర డాక్యుమెంట్లను అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు . చిత్రమేమిటీ అంటే ఈ డాక్యుమెంట్లలో రాబర్ట్ వాద్రా పేరు వెలుగు చూడడం. దాంతో తీగ లాగిన అధికారులకు డొంక లండన్ లో కనిపించింది అని అంటున్నారు. లండన్ లో ఒక స్థిరాస్తికి రబర్ట్ వాద్రాకు సంబంధం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే 2017ల్ ఫిబ్రవరిలఒ ఈడీ నగదు అక్రమ చలామణీ చట్టం కింద భండారీ తదితరుల మీద కేసులు అమోదు అయ్యాయని చెబుతున్నారు
కూపీ లాగిన ఈడీ :
అలా ఆయుధాల వ్యాపారి భండారీతో రాబర్ట్ వాద్రాకు ఉన్న సంబంధాల మీద కూడా ఈడీ సీరియస్ గానే విచారణ చేస్తోంది అని అంటున్నారు. అలా ఈడీ వాద్రాను గతంలో విచారించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అయితే తనకు ఈ కేసుతో కానీ ఈ వ్యవహారాలతో కానీ ఏ మాత్రం సంబంధం లేదని వాద్రా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయితే మరో ముఖ్య విషయం ఇక్కడ ఏమిటి అంటే 2016లో ఐటీ దాడులు జరిగిన వెంటనే సంజయ్ భండరీ లండన్ కి పారిపోవడం. ఆయనను అప్పగించాలని కోరినా అక్కడ బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కోర్టు ఈ ఏడాది జూలైలో సంజయ్ భండారీని పరారిలో ఉన్న వారుగా ఆర్ధిక నేరస్థుంగా కూడా ప్రకటించడం ఇక్కడ గమనార్హం.
ఈడీ దూకుడు :
ఇక రాబర్ట్ వాద్రా మీద వరసగా రెండు చార్జిషీట్లు నమోదు కావడంతో ఈడీ దూకుడు ఏంటో అర్ధం అవుతోంది. కాంగ్రెస్ లో గాంధీల కుటుంబానికి చెందిన రాబర్ట్ వాద్రా కేసు విషయం అయితే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
