Begin typing your search above and press return to search.

సన్ డే సంచలనం : బీహార్ లో రాహుల్...ఢిల్లీలో ఈసీ

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చాలా తీవ్రంగా ఈసీ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

By:  Satya P   |   17 Aug 2025 3:00 AM IST
సన్ డే సంచలనం : బీహార్ లో రాహుల్...ఢిల్లీలో ఈసీ
X

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చాలా తీవ్రంగా ఈసీ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గత పది రోజులుగా ఇది కొనసాగుతోంది. ఈసీ సమాధానం ప్రకటన రూపంలో అడపా దడపా ఉంటున్నా రాహుల్ గాంధీ ఆరోపణల తీవ్రత ముందు అవి ఎక్కడా సౌండ్ చేయడం లేదు. దాంతో ఏకంగా తామే స్వయంగా రంగంలోకి దిగాలని ఈసీ భావినినట్లు ఉంది అని అంటున్నారు. అందుకే ఒక కీలక ప్రెస్ మీట్ ని ఈసీ ఈ ఆదివారం అంటే 17వ తేదీన నిర్వహిస్తోంది.

ఈసీ చరిత్రలోనే ఫస్ట్ టైం :

ఈ ప్రెస్ మీట్ ఈసీ చరిత్రలోనే తొలిసారి అని అంటున్నారు. ఇప్పటిదాకా ఈసీ ప్రెస్ మీట్ పెడితే అవి దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేసేటపుడు, అలాగే దేశంలో లోక్ సభ ఎన్నికల విషయంలో షెడ్యూల్ ని ప్రకటించేటపుడు ఉండేది. అలాంటి ఈసీ ఇపుడు తన మీద అదే పనిగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు చేస్తున్న ఆరోపణల నేపధ్యంలో మీడియా ముందుకు రాబోతోంది. ఈ ఆరోపణల విషయంలో మొదట ఎందుకో నెమ్మదిగానే ఈసీ రియాక్ట్ అయింది. కానీ ఇపుడు అత్యవసరం అనుకునే మీడియాని పిలుస్తోంది అని అంటున్నారు.

జనబాహుళ్యంలోకి అలా :

అయితే ఈసీ ఇంత టైం తీసుకోవడం కూడా వేరే సంకేతాలు ఇచ్చేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా ప్రతీ రోజూ ఇదే అంశం మీద రాహుల్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ అలాగే ఇండియా కూటమి నేతలు అదే పనిగా చేస్తున్న ఆరోపణలతో అవన్నీ జన బాహుళ్యంలోనికి విస్తారంగా వెళ్ళిపోయాయి. ఏ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు తగినట్లుగా అక్కడ వీటి మీద పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. దాంతోనే ఈ పరిస్థితి తీవ్రత గ్రహించిన ఈసీ రంగంలోకి దిగుతోంది అని అంటున్నారు.

రాహుల్ కాదు జనాలకు :

మామూలుగా విపక్షం నుంచి ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటికి జవాబు చెప్పాలా అని పాలక పక్షం ఆలోచిస్తుంది. కానీ విపక్ష నాయకుడికి కానీ వేరే వారికి కానీ జవాబు ఇస్తున్నామని అసలు అనుకోవడానికే లేదు. జనాలు కోట్లలో ఉన్నారు. వారికి మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక చర్చ జరుగుతున్నపుడు వాస్తవాలు ఇవీ అని ఎంత వేగంగా చెబితే అంత తొందరగా దాని మీద వచ్చే అపోహలు కానీ మరేమైనా కానీ అర్ధమై దాని ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చేస్తేనే ఇబ్బందులు వస్తాయి.

కరెక్ట్ టైం లోనా :"

ఇదిలా ఉంటే రాహుల్ ఓటు చోరీ ఆరోపణల మీద .ఈసీ ప్రెస్ మీట్ లో చెప్పే విషయాలు సంచలనమేనా అన్న చర్చ కూడా ఉంది. రాహుల్ గాంధీ ఓటు అధికార్ యాత్ర అన్న దానిని బీహార్ లో ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఏకంగా పదిహేను రోజుల పాటు ఈ యాత్ర బీహార్ అంతటా మూడు వేల కిలోమీటర్ల దూరాన సాగనుంది. ఈ యాత్ర కోసం బీహార్ కి రాహుల్ గాంధీ వెళ్తూంటే ఢిల్లీలో కరెక్ట్ గా అదే రోజు ఈసీ ప్రెస్ మీట్ పెడుతోంది. మరి రాహుల్ చేసే ఆరోపణల మీద పూర్తి సమగ్రమైన వివరణను ఈసీ ఇస్తుందా అన్నదే అంతా ఆసకతిగా చూస్తున్నారు. ఈసీ ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల విషయంలో సీరియస్ గా రియాక్ట్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే సండె సంచలనానికి ఈ పరిణామాలు దారి తీస్తాయా అని అంతా ఆలోచిస్తున్నారు.