ఆధారాలిస్తే.. విచారణ చేస్తాం: రాహుల్‌కు ఈసీ నోటీసు
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 10 Aug 2025 7:44 PM ISTకేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తమ వద్ద అణుబాంబు వంటి సమాచారం ఉందని, దీనిని బయట పెడితే ఈసీ దాక్కోవడానికి చోటు కూ డా ఉండదని వ్యాఖ్యానించారు. చివరకు ఆయన తన వద్ద ఉన్న ఆధారాలతో ఇటీవల మీడియా ముందు కు రావడం.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈసీ చేసిన తప్పులను ఎండగట్టడం తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటకలోని మహదేవ పుర అసెంబ్లీ నియోజకవర్గంపై ఆరోపణలు చేశారు.
బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి లక్షకు పైగా ఓట్ల మెజారిటీ రావడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. ఇక్కడ జరిగిన ఓట్ల అవకత వకలను రాహుల్ గాంధీ వెల్లడించారు. శకున్ రాణి అనే మహిళ.. రెండు సార్లు ఓట్లు వేశారని రాహుల్ ఆరో పించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఇవీ.. అంటూ.. ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు జాబితాను మీడియాకు చూపించారు.
అలాగే.. ఒకే డోర్ నెంబరులో 80 వేల ఓట్లు ఉన్నాయని.. ఒకే వ్యక్తి పేరుతో 33 వేల ఓట్లు నమోదయ్యాయని రాహుల్ పేర్కొన్నారు. అయితే.. తాను తీసుకున్న అన్ని వివరాలు కూడా ఎన్నికల సంఘం ఇచ్చిన జాబితాలోనివేనన్నది రాహుల్ వాదన. ఇదిలావుంటే.. ఈ వ్యవహారంపై కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి తాజాగా రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. మీరు చేసిన వాదన, చూపిన ఆధారాలను మాకు అందిస్తే.. విచారణ చేస్తామన్నారు. లోతైన విచారణ చేసేందుకు సహకరించాలని కోరారు.
ఇదేసమయంలో శకున్ రాణి .. రెండు చోట్ల ఓటు వేసిందన్న వాదనను కర్ణాటక ఎన్నికల అధికారి తోసిపు చ్చారు. ఆమె ఒక్కసారి మాత్రమే ఓటు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా.. టిక్ మార్కు చేసి.. రాహుల్ వివరించిన ఎన్నికల జాబితా అసలు తాము ఇచ్చిందని కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరింత విచారణ చేసేందుకు ఆయా ఆధారాలను తమకు సమర్పించాలని కోరుతూ.. నోటీసులు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
