Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో హాలిడేస్... భూమి-అంగారకుడి మధ్య కనెక్షన్ కట్ ఎందుకంటే..!

అవును... అంగారక గ్రహంతో నాసా అన్ని రకాల సంబంధాలను కోల్పోనుంది. ఇందులో భాగంగా... ఆ గ్రహంపై ఉన్న అన్ని రోవర్లు, ఆర్బిటర్లు, ల్యాండర్లు కొన్ని వారాలపాటు రేడియో-సైలెంట్ గా మారిపోనున్నాయి.

By:  Raja Ch   |   21 Dec 2025 4:00 PM IST
అంతరిక్షంలో హాలిడేస్...  భూమి-అంగారకుడి మధ్య కనెక్షన్  కట్  ఎందుకంటే..!
X

భూమిపై ఉన్న మనిషి తదుపరి మజిలీ అంగారకుడిపైనే అనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా మనిషి మనుగడకు అంగారక గ్రహమే సురక్షితమని.. 2026 చివరి నాటికి స్టార్ షిప్ రాకెట్ ఆ గ్రహానికి సిబ్బందిని పంపే అవకాశం 50% ఉందని చెబుతున్నారు ఎలాన్ మస్క్. ఆ సంగతి అలా ఉంటే.. ప్రస్తుతం అంగారక గ్రహానికి, భూమికి మధ్య ఒకరు అడ్డు వచ్చారు.. ఫలితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంతా చీకటే!

అవును... అంగారక గ్రహంతో నాసా అన్ని రకాల సంబంధాలను కోల్పోనుంది. ఇందులో భాగంగా... ఆ గ్రహంపై ఉన్న అన్ని రోవర్లు, ఆర్బిటర్లు, ల్యాండర్లు కొన్ని వారాలపాటు రేడియో-సైలెంట్ గా మారిపోనున్నాయి. ఫలితంగా.. నీలి గ్రహం భూమి.. ఎర్ర గ్రహం అంగారకుడితో అన్ని సంబంధాలనూ కోల్పోతుంది. దీనికి కారణం... ఈ రెండు గ్రహాల మధ్య సూర్యుడు అడ్డుగా రావడమే. దీనినే సౌర సంయోగం (సోలార్ కన్జంక్షన్) అని అంటారు.

వాస్తవానికి భూమి, అంగారక గ్రహాల మధ్య ఎల్లప్పుడూ నిరంతర దృశ్యమానత ఉండదు! ఈ క్రమంలో.. దాదాపు ప్రతీ రెండు భూ సంవత్సరాలకు ఒకసారి భూమికి, అంగారకుడి మధ్య సూర్యుడు వచ్చి, వాటి మధ్య దృశ్యాన్ని అడ్డుకుంటాడు. ఇలా ఈ రెండు గ్రహాల మధ్య సూర్యుడు అడ్డు వచ్చినప్పుడు.. ఇవి రెండు ఎదురెదురుగా ఒకదానికి ఒకటి కనిపించదు.. ఇదే సమయంలో సూర్యుని ప్రభావంతో ఈ రెండు గ్రహాల మధ్య సిగ్నల్స్ ఉండవు.

ఫలితంగా భూమిపై ఉన్న గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలు.. అంగారక గ్రహాన్న్ని చూడలేవు. ఇదే సాయంలో.. అంగారక గ్రహంపై ఉన్న ల్యాండర్లు, రోవర్లు, ఆర్బిటర్లు భూమినీ చూడలేవు. ఫలితంగా... ఎర్రగ్రహానికి, నీలి గ్రహానికి మధ్య చీకటితో పాటు సిగ్నల్స్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో.. అంగారక గ్రహంపై అంతరిక్ష నౌకలు భూమికి సంకేతాలు పంపినప్పుడు.. సూర్యుని నుంచి వచ్చే చార్జ్డ్ కణాలు రేడియో తరంగాలతో జోక్య చేసుకుంటాయి.. ఫలితంగా భూమికి చేరే డేటాలో అంతరాలు ఏర్పడాయి.

ఇదే సమయంలో.. అంగారకుడి ఉన్న అంత్రరిక్ష నౌకకు భూమి నుంచి ఆదేశాలను పంపితే.. వాటినీ సూర్యుని చార్జ్డ్ కణాలు వక్రీకరించి.. అంతరిక్ష నౌకను గందరగోళానికి గురిచేసి, వాటిని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. సౌర సంయోగం వల్ల ఏర్పడిన ఈ తాత్కాలిక బ్లాక్ అవుట్ నేపథ్యంలో ఇంజినీర్లు అంగారక గ్రహంపై ఉన్న అంతరిక్ష నౌకకు ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన సూచనలను పంపవలసి ఉంటుంది.