Begin typing your search above and press return to search.

కాశీబుగ్గ పండాతో ఎమ్మెల్సీ దువ్వాడకు లింకు! వెరీ ఇంట్రస్టింగ్ అప్డేట్

ఇదే సమయంలో ఆయన ప్రేయసి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్-9లో అందరినీ అలరించారు. దీంతో ఈ ఇద్దరు ఎటు వెళ్లినా సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Nov 2025 5:00 PM IST
కాశీబుగ్గ పండాతో ఎమ్మెల్సీ దువ్వాడకు లింకు! వెరీ ఇంట్రస్టింగ్ అప్డేట్
X

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మధ్య సంబంధాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 2వ తేదీన కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలో హరి ముకుంద పండా నిర్మించిన ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. ఈ ఉదంతం తర్వాత హరి ముకుంద పండాపై ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చ జరిగింది. 95 ఏళ్ల హరి ముకుంద పండా కోట్లాది రూపాయలు సొంత డబ్బు వెచ్చించి 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఈ ఘటన తర్వాత వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాశీబుగ్గకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన దువ్వాడ గత మూడు దశాబ్దాలుగా హరిశ్చంద్రపురం, టెక్కలి నియోజకవర్గాల నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చారు. టీడీపీ ప్రధాన నేతలు కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడి రాజకీయ ప్రత్యర్థిగా పోరాడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆయన ప్రేమాయణం తీవ్ర వివాదాస్పదం కాగా, భార్యతో విభేదాలు రావడంతో తన మకాం హైదరాబాద్ కు మార్చారు. ఇక నిత్యం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ డిజిటల్ స్టార్ గా దువ్వాడ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదే సమయంలో ఆయన ప్రేయసి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్-9లో అందరినీ అలరించారు. దీంతో ఈ ఇద్దరు ఎటు వెళ్లినా సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక కాశీబుగ్గ ప్రమాదం తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ తన ప్రేయసితో కలిసి హరి ముకుందా పండాను కలవడం ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యవహారాలతో దూరంగా ఉన్న ఆయన సడన్ గా రావడం వెనుక ఆసక్తికర విశేషాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ రాజకీయంగా టెక్కలిలో పనిచేసినప్పటికీ, ఆయన పుట్టి పెరిగింది మాత్రం కాశీబుగ్గలోనే.. ఆయన తల్లి, సోదరులు ఇక్కడే నివసిస్తుంటారు. ఆ విధంగా దువ్వాడ సొంత ఊరు కాశీబుగ్గగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి, హరి ముకుంద పండాకు మంచి స్నేహితులు. అదేవిధంగా హరిముకుంద పండా కుమారుడు హెచ్.రాజకుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ క్లాస్ మేట్స్. ఈ ఇద్దరు స్కూలింగ్ అంతా ఒకేచోట జరిగినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

కాశీబుగ్గ వచ్చిన దువ్వాడ ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండా కోసం ఎవరూ చెప్పని విశేషాలు కూడా చెప్పారు. దాదాపు వంద కోట్ల ఆస్తులు ఉన్న హరి ముకుంద పండా శ్రీవిజయ వెంకటేశ్వరుడి పేరున 12 ఎకరాల భూములు రాశారని, అంతేకాకుండా భవిష్యత్తులో ఆలయ కైంకర్యాలకు ఎటువంటి లోటు రాకుండా రూ.6 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఎమ్మెల్సీ దువ్వాడ వెల్లడించారు. అంతేకాకుండా హరి ముకుందా పండా తన సొంత డబ్బును ప్రతి నెలా వికలాంగులు, అనాథలకు పింఛన్లుగా పంచుతారని, అలా ప్రతినెలా రూ.3 లక్షలు ఖర్చుచేస్తారని కూడా చెప్పారు. ఇక తండ్రి బాటలోనే డాక్టర్ రాజ్ కుమార్ పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

పలాస-కాశీబుగ్గలో హరి ముకుంద పండా కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ వివరించారు. వ్యక్తిగతంగా చాలా గొప్ప మనిషి అని కొనియాడు. అటువంటి వ్యక్తిని 95 ఏళ్ల వృద్ధుడిని తొక్కిసలాటకు కారకుడిగా ప్రభుత్వం చూపే ప్రయత్నాలు చేస్తుందని తనకు తెలిసిందని, దయచేసి అలాంటి ప్రయత్నం చేయొద్దని అభ్యర్థించారు దువ్వాడ. మానవ తప్పిదంగా కేసును నమోదు చేయాలని, ఈ ప్రాంతీయులకు హరి ముకుంద పండా సేవలు కొనసాగేలా చూడాలని దువ్వాడ కోరారు.