Begin typing your search above and press return to search.

దుబాయ్‌లో మొగుడి కోసం పెళ్లాం కష్టం.. చెన్నై ఇంట్లో ‘కృష్ణలీలలు’ ఆడిన మొగుడికి పడిన ‘క్యామ్‌’ నిఘా!

కథలోకి వెళ్తే.. మన కథానాయిక కుటుంబ భవిష్యత్తు కోసం ఎడారి దేశం దుబాయ్‌లో రక్తాన్ని చెమటగా మారుస్తూ ఉద్యోగం చేస్తోంది.

By:  A.N.Kumar   |   23 Jun 2026 2:34 PM IST
దుబాయ్‌లో మొగుడి కోసం పెళ్లాం కష్టం.. చెన్నై ఇంట్లో ‘కృష్ణలీలలు’ ఆడిన మొగుడికి పడిన ‘క్యామ్‌’ నిఘా!
X

"భార్య వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. నా గుండెల్లోనే ఉంది" అని డైలాగులు చెప్పే భర్తలకు కాలం చెల్లిపోయింది బ్రదరూ.. ఎందుకంటే ఇప్పుడు భార్యలు కేవలం గుండెల్లోనే కాదు.. ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో, ఐఫోన్ స్క్రీన్లలో కూడా లైవ్‌లో ఉంటున్నారు. దుబాయ్‌లో భార్య కష్టపడుతుంటే.. చెన్నై ఇంట్లో ‘రొమాంటిక్ రీల్స్’ లైవ్‌గా ప్లే చేసిన ఒక మహానుభావుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

దుబాయ్ టు చెన్నై.. పొరుగువారి పుల్లలు!

కథలోకి వెళ్తే.. మన కథానాయిక కుటుంబ భవిష్యత్తు కోసం ఎడారి దేశం దుబాయ్‌లో రక్తాన్ని చెమటగా మారుస్తూ ఉద్యోగం చేస్తోంది. ఇక్కడ చెన్నైలో భర్త గారు మాత్రం ‘ఇల్లాలి చలువ.. ఇంటి ముందరి కొలువు’ అన్నట్టు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో భర్త గారి ఇంటికి అర్ధరాత్రి వేళల్లో ‘అపరిచిత దేవతలు’ వచ్చిపోతున్నారని పొరుగువారు భార్యకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. మొదట "నా మొగుడు చాలా మంచోడు, రామచంద్రుడి లాంటివాడు" అని నమ్మిన ఆ ఇల్లాలు.. అనుమానం పెరగడంతో ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.

'జేమ్స్ బాండ్' రేంజ్‌లో భార్య ప్లాన్

మొగుడికి అస్సలు అనుమానం రాకుండా.. టెక్నాలజీని వాడుకుంది. ఇంట్లో సీక్రెట్‌గా ఒక సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయించి.. దాని కనెక్షన్‌ను దుబాయ్‌లో ఉన్న తన మొబైల్‌కు లింక్ చేసుకుంది. కొన్ని రోజుల పాటు కెమెరాలో కేవలం భర్త గారు టీవీ చూడటం, నిద్రపోవడం లాంటి పతివ్రత పనులు మాత్రమే కనిపించాయి. దీంతో ఆమె కూడా "అబ్బా.. నా మొగుడు నిజంగానే రాముడు" అని ఫిక్స్ అయిపోయింది. కానీ అసలు సినిమా ముందుందిగా!

'సర్‌ప్రైజ్ విజిట్'.. హోటల్ రూమ్ నుండి లైవ్ షో!

కథలో ట్విస్ట్ ఇస్తూ.. భార్య భర్తకు చెప్పకుండా చెన్నైకి ఫ్లైట్ ఎక్కేసింది. కానీ డైరెక్ట్‌గా ఇంటికి వెళ్తే 'సర్‌ప్రైజ్' మిస్ అవుతుందని భావించి.. ఒక ప్రైవేట్ హోటల్‌లో రూమ్ తీసుకుని సెటిల్ అయింది. శనివారం రాత్రి పాప్‌కార్న్ తింటూ ఫోన్‌లో సీసీటీవీ లైవ్ ఫుటేజ్ చూడటం స్టార్ట్ చేసింది. అంతే.. స్క్రీన్ మీద ‘హౌస్ ఫుల్’ బోర్డ్ పడింది.. ఒక అపరిచిత మహిళ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం.. భర్త గారు ఆమెకు ఘనస్వాగతం పలకడం అంతా లైవ్‌లో కనిపించింది. ఇంకేముంది.. దుబాయ్ రిటర్న్ భార్యకు మైండ్ బ్లాంక్ అయింది!

భార్య ఎంట్రీ.. భర్త ‘ఉసేన్ బోల్ట్’ పరుగు!

లైవ్ షో చూసిన వెంటనే భార్య ఆగ్రహంతో ఊగిపోతూ ట్యాక్సీ పట్టుకుని ఇంటికి దూసుకొచ్చింది. కానీ ఈ లోపే ఎవరో ‘ఇన్ఫార్మర్’ భర్తకు హింట్ ఇచ్చేయడంతో.. భర్త గారు ఆ మహిళతో కలిసి ఒలింపిక్ రన్నర్ లాగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు.

ఈ ఘటనతో మనకు తెలిసేది ఏంటంటే..

టెక్నాలజీ పెరిగిపోయింది బ్రదర్స్. భార్య పక్క ఊర్లో ఉన్నా.. పక్క దేశంలో ఉన్నా.. మూడో కన్ను లాంటి సీసీటీవీలు ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. ఒకప్పుడు మొగుడి మీద అనుమానం వస్తే జుట్టు పట్టుకుని గొడవపడేవాళ్లు. ఇప్పుడు సీదా ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ‘రొమాంటిక్ అండ్ మిస్టరీ’ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ సీసీటీవీలో కనిపించిన ‘ఆమె’ ఎవరు? భర్త గారు ఏ ఊరి అడవుల్లో దాక్కున్నారు? అనేది తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..