దుబాయ్: ఆకాశంలో మిస్సైల్స్ సౌండ్.. కింద డీజే సౌండ్!
ఒకవైపు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు చేస్తుంటే.. ఆకాశంలో మిస్సైల్స్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నా.. దుబాయ్ లోని ప్రజలు మాత్రం చాలా సేఫ్ గా డీజే పార్టీలు నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
By: Madhu Reddy | 2 March 2026 1:31 PM ISTఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ జాయింట్ గా ఎయిర్ స్ట్రైక్ చేస్తున్న నేపథ్యంలో.. యుద్ధ ప్రభావం తెలుగు మీడియాలో చూపిస్తున్నట్టు దుబాయ్ పై పడింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నా.. అక్కడి నుండి వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే మాత్రం అక్కడి ప్రజలు ఎంత సేఫ్ గా తమ దైనందిత జీవితాన్ని గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు ఆకాశంలో భయాన్ని పుట్టించే మిస్సైల్స్ సౌండ్ భయపెడుతుంటే .. కింద డిజె సౌండ్స్ మాత్రం ఎప్పటిలాగే అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా దుబాయ్ ఐ స్పేస్ నుండీ కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం కాస్త బయటపడింది.
భయం పుట్టించే మిస్సైల్స్ సౌండ్.. కిక్కిస్తున్న డీజే సౌండ్ ..
ఒకవైపు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడులు చేస్తుంటే.. ఆకాశంలో మిస్సైల్స్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నా.. దుబాయ్ లోని ప్రజలు మాత్రం చాలా సేఫ్ గా డీజే పార్టీలు నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మిస్సైల్స్ ఎంతో వేగంగా భూమి వైపు దూసుకొస్తున్నప్పటికీ దుబాయ్ ప్రభుత్వం వాటిని చాకచక్యంగా తిప్పికొడుతూ.. కూల్చివేస్తూ ప్రజలకు దుబాయ్ అత్యంత సేఫ్ అయిన ప్లేస్ అని నిరూపిస్తోంది.
ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న మెట్రో ట్రైన్స్..
ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో జరుగుతున్న దాడులతో పోల్చుకుంటే దుబాయ్ లో ఈ దాడులు పెద్దగా జరుగుతున్నట్టు కనిపించడం లేదు. కేవలం దుబాయ్ ఐ స్పేస్ మాత్రమే క్లోజ్ చేశారు. కానీ ఎప్పటిలాగే దుబాయ్ లో జరిగే అన్ని కార్యకలాపాలు సవ్యంగా సాగుతున్నాయి.. ఐ స్పేస్ క్లోజ్ చేసి ఉండవచ్చు కానీ అక్కడ జరిగే వేడుకల హడావిడి.. ప్రజల రద్దీతో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతూ.. మెట్రో ట్రైన్స్ సౌండ్.. యూత్ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటిలాగే కొనసాగుతోంది.
యుద్ధ పరిణామాలు లేని దుబాయ్..
ముఖ్యంగా సామాన్య రోజుల్లో ఎలా అయితే నడుస్తోందో ఇప్పుడు కూడా అలాగే అక్కడ జరుగుతూ ఉండడం గమనార్హం . ముఖ్యంగా అక్కడ ఎలాంటి భయభ్రాంతులకు లోనయ్యే దృశ్యాలు, సన్నివేశాలు జరగడం లేదు
ఇకపోతే గల్ఫ్ దేశాలలో ప్రధానంగా జరుగుతున్న ఈ దాడులు దుబాయ్ ని పెద్దగా తాకలేదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా వెలువడిన విజువల్స్ ని బట్టి చూస్తే పైన ఆకాశంలో మిస్సైల్స్ దాడులు మెరుపుతీగల నేలకు వస్తుంటే కింద ప్రజలు మాత్రం డీజే సౌండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రయాణికులు సేఫ్..
ఇక అందరూ భయపడుతున్నట్టు అక్కడ ఏమి యుద్ధ పరిణామాలు కనిపించడం లేదు. ఎప్పటిలాగే అన్ని పనులు సవ్యంగా సాగిపోతున్నాయి. ఐ స్పేస్ క్లోజ్ అయినప్పటికీ అక్కడ కింద పార్టీలు, ఫంక్షన్లు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇక మొత్తానికైతే దుబాయ్ గల్ఫ్ దేశాలలో అత్యంత సేఫ్ ప్లేస్ గా మరోసారి నిరూపించబడింది. ఇకపోతే ఆకాశంలో మిస్సైల్స్ దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే విమానయాన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది . ప్రస్తుతం అక్కడ చిక్కుకున్న సినీ సెలబ్రిటీలు సేఫ్ గా ఉన్నట్లు సమాచారం.
