Begin typing your search above and press return to search.

రెండేళ్లు.. 27 కేజీలు తగ్గేసింది.. ఎంత సింఫుల్ గా అంటే?

ప్రతి రోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయాలని.. అదే శరీరంలో పెను మార్పులను తీసుకొస్తుందన్న ఆమె.. ‘‘నేను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతాను.

By:  Garuda Media   |   23 Sept 2025 1:00 PM IST
రెండేళ్లు.. 27 కేజీలు తగ్గేసింది.. ఎంత సింఫుల్ గా అంటే?
X

సంకల్పం.. అందుకు మించి లక్ష్యాన్నిచేధించాలన్న పట్టుదలకు కసి తోడై.. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళితే అసాధ్యమన్నదంటూ ఏమీ ఉండదు. అవును.. 84 కేజీలున్న గుండు మల్లె లాంటి ఒక మహిళ.. రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 27 కేజీలు తగ్గిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు పిల్లల తల్లైనప్పటికి.. చూసినంతనే మెరుపు తీగలా తనను తాను మార్చుకున్న వైనం ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించేలా చేయటమే కాదు..అధిక బరువు సవాలును సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చన్న నమ్మకాన్ని కల్పించటంలో ఆమె నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుందని చెప్పాలి.

రోటీన్ జీవితాన్ని ఫాలో అవుతూ.. బరువు తగ్గాలన్న లక్ష్యం పక్కకు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఆమె ఇంకెవరో కాదు.. డాక్టర్ కం ఎంటర్ ప్రెన్యూర్ భావన ఆనంద్. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె విపరీతమైన బరువు పెరిగారు. 2022 నాటికి ఏకంగా 84 కేజీలు ఉండేవారు. అలాంటి ఆమె రెండున్నరేళ్ల వ్యవధిలో స్మార్ట్ గా మారిపోవటమే కాదు.. ఆమె బరువు అక్షరాల 56కేజీలకు చేరుకున్నారు.

ఆమె లుక్ కు ఫిదా కానోళ్లు లేరు. అదే సమయంలో ఇంతలా బరువు తగ్గటం ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్న తరచూ ఎదురవుతున్న వేళ.. ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో తాను మూడు చిట్కాలతో బరువు తగ్గిన సీక్రెట్ ను షేర్ చేసుకున్నారు. ‘ఆ మూడు అలవాట్లే నా జీవితాన్ని మార్చాయ్’ అన్న క్యాప్షన్ తో పాటు తనకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు.

ప్రతి రోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయాలని.. అదే శరీరంలో పెను మార్పులను తీసుకొస్తుందన్న ఆమె.. ‘‘నేను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతాను.

ఇది కాల క్రమంలో మంచి పురోగతి సాధించేందుకు సాయం చేస్తుంది. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ప్యాక్ ఉండేలా చూసుకుంటూ ఉంటా. ప్రోటీన్ రిచ్ వంటకాలు కండరాల పెరుగుదలకు.. మొత్తం పోహకాహార సమతుల్యతకు కీలకంగా మారతాయి. వీటితో పాటు అత్యంత ముఖ్యమైన అంశాల్లో రాత్రి వేళ త్వరగా భోజనం చేయటం.. ఉదయాన్నే నిద్ర లేవటం లాంటివి శరీరానికి ఒక నిర్దిష్ట దినచర్యను కంటిన్యూ చేసేలా చేస్తాయి. దీంతో అంతా సవ్యంగా జరిగే చేస్తుంది. బరువు తగ్గేందుకు సాయం చేస్తుంది’ అని చెబుతూ.. ఈ మూడు చిట్కాలు కొనసాగిస్తే.. ఎవరైనా బరువు తగ్గుతారని చెప్పుకొచ్చారు.

ఇక్కడో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. బరువు తగ్గటం అన్న విషయానికి వస్తే.. ఏ ఒక్కరు మరొకరిలా ఉండరన్నది వాస్తవం. ఈ మూడు చిట్కాలతో బరువు తగ్గుతారన్నది డాక్టర్ భావన ఆనంద్ విషయంలో సాధ్యమైంది. అందరికి ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పలేం. అందుకే.. బరువు తగ్గాలన్న పట్టుదలతో ఉండే వారు వైద్యుల సలహాలు.. సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.