Begin typing your search above and press return to search.

లండన్ లో నారా భువనేశ్వరికి పురస్కారం.. ప్రత్యేక అతిథి చంద్రబాబు

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025ను నారా భువనేశ్వరికి లండన్ లో అందజేశారు.

By:  Garuda Media   |   5 Nov 2025 12:35 PM IST
లండన్ లో నారా భువనేశ్వరికి పురస్కారం.. ప్రత్యేక అతిథి చంద్రబాబు
X

అరుదైన సీన్ కు వేదికగా మారింది లండన్. భార్య పారిశ్రామికవేత్త కావటం.. భర్త ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం.. అంతర్జాతీయ సంస్థ ఒకటి వ్యాపారవేత్త అయిన ఆమెకు పురస్కారం అందిస్తుంటే.. ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో ఉన్న భర్త ముఖ్య అతిధిగా హాజరు కావటం లాంటి రేర్ సన్నివేశాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025ను నారా భువనేశ్వరికి లండన్ లో అందజేశారు.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు విశిష్ఠ అతిధిగా హాజరయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకున్నారు. ఒకే వేదికపై రెండు పురస్కారాలు ఒకరే అందుకోవటం కాస్త రేర్ గా చెప్పాలి.

ఇదే వేదిక మీద చంద్రబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించటం మరో విశేషంగా చెప్పాలి. ఇంతకూ నారా భువనేశ్వరికి ఏ హోదాలో ఈ పురస్కారాన్ని అందించారన్న విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ - సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష క్రషికి ఈ పురస్కారాన్ని అందించారు. ఎన్టీనఆర్ ట్రస్ట్ సంస్థ రక్తదాన శిబిరాలు.. పేద విద్యార్థులకు సహాయ సహకారం..తలసేమియా రోగులకు ఉచితంగా రక్తమార్పిడి చేయటం లాంటివెన్నో కార్యక్రమాల్ని ఆమె చేపట్టారు.

సేవా భావం ఒకవైపు.. మరోవైపు దేశంలోనే ప్రతిష్ఠాత్మక డెయిరీ బ్రాండ్ గా హెరిటేజ్ ను తీర్చిదిద్దం మామూలు సవాలు కాదు. ఈ విషయంలో నారా భువనేశ్వరి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఒకే సంస్థ.. ఒకే వేదికపైన విజయవంతమైన వ్యాపారవేత్తగా.. మరోవైపు సేవా కార్యక్రమాల్ని చేపట్టటం ద్వారా ఎంతోమందికిఅండగా నిలుస్తున్న ఆమెకు.. ఈ రెండు రంగాల్లో ఒకేసారి పురస్కారం అందుకోవటం కాస్తంత అరుదైన అంశంగా చెప్పాలి. ఏమైనా.. ఈ తరహా సన్నివేశం భవిష్యత్తులో మరింత కష్టమని మాత్రం చెప్పకతప్పదు.