ఏమిటీ డూమ్ స్క్రోలింగ్.. దీని బారిన పడకుండా ఎలా?
చేతిలో సెల్ ఫోన్ లేనోళ్లే కనిపించరు. కేజీ చదివే చిన్న పిల్లలు మొదలు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే.
By: Garuda Media | 23 Aug 2025 9:41 AM ISTచేతిలో సెల్ ఫోన్ లేనోళ్లే కనిపించరు. కేజీ చదివే చిన్న పిల్లలు మొదలు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే. మనిషి జీవితంలో భాగంగా మారిన సెల్ ఫోన్ చేస్తున్న విపరీతాలు అన్ని ఇన్ని కావు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారిలో ఎక్కువ మంది డూమ్ స్క్రోలింగ్ బారిన పడొచ్చు. ఇంతకూ ఈ డూమ్ స్క్రోలింగ్ ఏమిటి? అంటారా?అక్కడికే వస్తున్నాం.
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాడే వాటిల్లో ఇన్ స్టా.. ఫేస్ బుక్.. యూట్యూబ్ తప్పనిసరిగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కాస్త ఖాళీ దొరికితే చాలు.. సెల్ ఫోన్ స్క్రీన్ ఓపెన్ చేసి.. అప్డేట్స్ చెక్ చేసుకోవటం అలవాటుగా మారింది. ఇదెంత ఎక్కువైందంటే.. ఎవరితో అయినా మాట్లాడే సమయంలో.. మధ్యలో కొన్ని క్షణాలు మాటలు ఆగినంతనే.. చేతిలో ఉన్న ఫోన్ కు పని చెప్పటం కనిపిస్తుంది.
ఇలా స్క్రోల్ చేసే క్రమంలో అవసరమైన అంశాలే కాదు.. అనవసరమైన అంశాలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంశాలు మనసును తీవ్రంగా ప్రబావితం చేస్తుంటాయి. నెగిటివ్ నెస్ ను పెంచుతాయి. వాటి అవసరం లేకున్నా.. ఉత్సుకతతో చూడటం మొదలు పెడితే.. అదే తరహా కంటెంట్ వరదలా వచ్చి పడుతుంది. ఇలా మనకు అవసరం లేని.. ప్రతికూలంగా ఉండే అంశాల్ని అదే పనిగా చూడటాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. ఈ వీడియోల్ని తరచూ చూడటం ద్వారా మానసిక సంతులతను దెబ్బ తీస్తుంది.
సున్నిత మనస్కులు.. తాము నిద్రపోయే సమయంలో ఈ తరహా కంటెంట్ ను చూడటం ద్వారా నిద్రలేమి.. కలత నిద్రలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. మరి..దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలా దీని నుంచి తప్పించుకోవాలి? అన్న విషయానికి వస్తే.. మీ స్మార్ట్ ఫోన్ కు స్క్రీన్ కు యాప్ టైంను ఆన్ చేసుకుంటే.. అది మన మనసును హెచ్చరిస్తుంటుంది.
అంతేకాదు.. మనం ముందుగా చేసుకున్న సెట్టింగ్ కు అనుగుణంగా నిర్ణీత సమయం దాటినంతనే స్క్రీన్ ఆగిపోతుంది. అంతేకాదు.. మనం చూస్తున్ కంటెంట్ మీకు ఆసక్తిగా ఉందా? లేదా? అన్న నోటిఫికేషన్ రావటాన్ని గమనించే ఉంటారు. అలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాదనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం ద్వారా అలాంటి వాటి నుంచి తప్పించుకునే వీలుంది. అంతేకాదు.. నచ్చని అంశాలు అదే పనిగా వస్తుంటే.. రిపోర్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి.. హైడ్ అండ్ రిపోర్టు చేయటం ద్వారా నచ్చని అంశాల్ని మన దరికి చేరకుండా జాగ్రత్త పడొచ్చు.
