జగన్ అంటే.... లోకేష్ ఏం చెప్పారంటే ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో టీడీపీ యువ నేత మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశారు.
By: Satya P | 9 April 2026 9:11 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో టీడీపీ యువ నేత మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశారు. జగన్ గురించి ఎవరూ ఎక్కువగా ఆలోచించకండి, ఆయనను లైట్ తీస్కోండి అని పార్టీ క్యాడర్ కి కూడా సందేశం ఇచ్చేశారు ఎందుకంటే జగన్ కి లేనిది నిలకడ తనం అని కూడా కామెంట్స్ చేశారు. ఆయన ఏమి చెబుతారో కూడా దాని మీద సైతం నిలబడరని లోకేష్ కామెంట్స్ చేశారు.
సీరియస్ వద్దు అంటూ :
జగన్ అంటే ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు ఆయన మాటలు కూడా అంతే అని హితబోధ చేయడం విశేషం. మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ గురించి ఆయన తీరు గురించి కూడా తన పార్టీ వారికి విడమరచి చెప్పడం విశేషం. జగన్ అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు దూరంగానే ఉంటున్నారు అని గుర్తు చేస్తూ చురకలు అంటించారు.
అంతా గందరగోళం :
నిన్న మావిగాన్ అన్నారు, నేడు మళ్ళీ మూడు రాజధానులు అని ఆయనే అంటున్నారు అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఒకే నోటితో ఎన్నో మాటలు చెప్పడం జగన్ కే చెల్లిందని నిందించారు ఆయనకు మాట నిలకడ అన్నదే ఉండదని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ ఇంటికి ఎపుడూ జనాలు వెళ్ళలేరని ఎందుకంటే ఆయన ఇంటి చుట్టూ 30 అడుగుల ఇనుప కంచె ఏర్పటు చేసుకుని జనాలకు దూరంగా ఉంటారని లోకేష్ విమర్శించారు అదే 2019లో టీడీపీ ఓటమి పాలు అయినప్పటికీ చంద్రబాబు నిత్యం జనాల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. వెంటనే జనం లోకి వచ్చి ప్రజా సమస్యల మీద ఉద్యమించారు అని లోకేష్ చెపుకొచ్చారు ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకుని అర్ధం చేసుకుని ముందుకు సాగే నాయకత్వం చంద్రబాబుది అని లోకేష్ చెప్పారు.
కొత్త వారికి చాన్స్ :
తెలుగుదేశం పార్టీ ప్రతీ టెర్మ్ లో 33 శాతం మంది కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకుంది అని లోకేష్ చెప్పారు గ్రామ స్థాయి కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో మెంబర్ కావాలన్నదే పార్టీ లక్ష్యం అని లోకేష్ చెప్పారు పార్టీ సభ్యత్వం అంటే ఆధార్ కార్డు లాంటిదే అని లోకేష్ చెప్పారు. ఆ నంబర్ కనుక కొడితే ఎక్కడ ఏ నాయకుడు ఎంత మేర పనిచేశారో తెలిసిపోతుందని లోకేష్ చెప్పారు. సామాన్య కార్యకర్తలతో అధినేత పార్టీ ఆవిర్భవం దినోత్సవం వేళ గడిపారు అని గుర్తు చేసిన లోకేష్ దటీజ్ టీడీపీ అన్నారు. మొత్తానికి వైసీపీకి టీడీపీకి మధ్య తేడా ఏమిటో ఆయన స్పష్టంగా చెబుతూ జగన్ కి లైట్ తీస్కో అని క్యాడర్ కి సందేశం ఇచ్చారు.
